అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి సుకుమార్ చాలా టైం తీసుకున్నాడు. మహేష్ కాదన్న కథతో చిన్న మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్ స్టయిల్ కి తగ్గట్టుగా కథని ప్రిపేర్ చేసి పట్టాలెక్కించేసరికి సుకుమార్ తల ప్రాణం తోకకు వచ్చింది. అల్లు అర్జున్ కూడా కథ విషయంలో సుకుమార్ ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించాడనే టాక్ ఉంది. ఇక తాజాగా సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి కూడా అల్లు అర్జున్ అల్టిలెటం జారీ చేసాడంటున్నారు.
అల్లు అర్జు ప్రమోషన్స్ స్ట్రాటజీ అల వైకుంఠపురములో చాలా పక్కాగా వుంది. అల్లు అర్జున్ సలహాతోనే థమన్ అల వైకుంఠపురములో సాంగ్స్ పేక్షకులు మెచ్చేలా పూర్తి చేసి.. అల్లు అర్జున్ చెప్పినట్టుగా సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఒక్కో పాటని మార్కెట్ లోకి వదిలి అందరిని షేక్ చేసాడు. అయితే దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరు సినిమాకి ఇంకా సరిగ్గా మ్యూజిక్ తో పాటలే వదల్లేదు. మరి ఇలా తన సినిమా విషయంలో నాన్చుతుంటే.. కుదరదని, ప్రమోషన్స్ విషయంలో తాను పక్కాగా ఉంటానని.. అందుకే సుక్కుతో చేసే సినిమాకి మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ పక్కాగా ఉండాలని అల్లు అర్జున్ చెబుతున్నాడట. పాటల పరంగా కాంప్రమైజ్ కానని, ఎన్ని ట్యూన్స్ అయినా ఇచ్చి ఓకే చేయించుకోవాలే కానీ.. ఏదో ఒకటి ఇచ్చి ఓకే చెయ్యమంటే కుదరదని దేవి కి స్ట్రాంగ్ గా అల్లు అర్జున్ చెప్పాడని ఫిలింనగర్ టాక్.