Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్!

Wed 20th Nov 2019 01:39 PM
mahesh babu,sarileru neekevvaru,movie,latest,update  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్!
Sarileru Neekevvaru Teaser Release Date and Time Out ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

నవంబర్‌ 22న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రిలీజ్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం  ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను  22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Teaser Release Date and Time Out:

Sarileru Neekevvaru Movie Latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ