Advertisementt

‘F2’లో నవ్వించాడుగా.. ‘వెంకీమామ’లో మాత్రం!

Mon 18th Nov 2019 08:02 PM
venky mama movie,venkatesh,venkatesh role,venky mama,naga chaitanya,f2  ‘F2’లో నవ్వించాడుగా.. ‘వెంకీమామ’లో మాత్రం!
Venkatesh Role in Venky Mama Movie ‘F2’లో నవ్వించాడుగా.. ‘వెంకీమామ’లో మాత్రం!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది F2 తో అదిరిపోయే హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు నాగ చైతన్య‌తో కలిసి వెంకీమామ సినిమా చేస్తున్నాడు. వెంకటేష్.. పాయల్ రాజపుత్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాలో చైతు - వెంకటేష్ మామ అల్లుళ్లుగా కనిపిస్తున్నారు. F2 లో వరుణ్ తేజ్‌తో కలిసి బ్లాక్ బస్టర్ కామెడీ చేసిన వెంకటేష్, వెంకీమామలో మాత్రం గుండెలు పిండేసే ఎమోషన్స్ తో అదరగొడతాడని టాక్. వెంకటేష్ మార్క్ కామెడీ ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాడని అంటున్నారు. వెంకటేష్ - నాగ చైతన్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని తాజా సమాచారం.

మరి వెంకటేష్ - పాయల్ మధ్యన రొమాన్స్ కూడా ఉంటుందని.., చైతు - రాశి ఖన్నాల కన్నా వెంకీ జోడికి రొమాంటిక్ యాంగిల్ ఎక్కువని యూనిట్ చెబుతున్న మాట. మరి వెంకీమామ రిలీజ్ డేట్ పై కూడా రెండుమూడు రోజుల్లో పక్కా క్లారిటీ వచ్చేలా ఉంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ లో యూనిట్ వేగం పెంచింది. ఇప్పటివరకు వెంకీమామపై మార్కెట్‌లో పెద్దగా బజ్ లేకపోయినా.. ఇపుడు విడుదలవుతున్న సింగిల్స్, ట్రైలర్‌తో సినిమా మీద హైప్ పెంచి క్రేజ్ సంపాదించాలని మూవీ టీం భావిస్తోందట.

Venkatesh Role in Venky Mama Movie:

Emotional content in Venky Mama Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ