Advertisementt

చైతూ మరో రీమేక్‌పై మనసుపడుతున్నాడు

Mon 18th Nov 2019 06:53 PM
chhichhore,naga chaitanya,remake,tadakha,premam,chaitu  చైతూ మరో రీమేక్‌పై మనసుపడుతున్నాడు
Naga Chaitanya Interest on This Remake చైతూ మరో రీమేక్‌పై మనసుపడుతున్నాడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా తెరకెక్కి.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిచోరే సినిమాపై ఇప్పుడొక టాలీవుడ్ హీరో మనసుపారేసుకున్నాడనే టాక్ ఫిలింనగర్‌లో వినబడుతుంది. కాలేజ్ క్యాంపస్‌ బ్యాగ్డ్రాప్‌లో చేసిన కామెడీకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో.. ఎటువంటి అంచనాలు లేకుండానే ఈ సినిమా నూట యాభై కోట్లకి పైగా కొల్లగొట్టి సూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. మజిలీతో హిట్ కొట్టిన నాగ చైతన్య వెంకీమామ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇక వెంకీమామతో పాటుగా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (వాడుకలో ఉన్న టైటిల్) సినిమాలో సాయి పల్లవితో జోడి కట్టాడు. ఈ సినిమా మార్చి‌లో విడుదలకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత  చైతన్య చిచోరే సినిమా రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇంతకుముందు రీమేక్ చిత్రాలతో హిట్ అందుకున్న చైతూ ఈ రీమేక్‌తో కూడా హిట్ కొట్టాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. ‘తడాఖా’, ‘ప్రేమమ్’ వంటి రీమేక్‌లతో హిట్టుకొట్టిన చైతూ ముచ్చట పడుతున్న ‘చిచోరే’ రీమేక్ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

Naga Chaitanya Interest on This Remake:

Naga Chaitanya eye on Chhichhore Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ