Advertisementt

‘పరారి’ ఆ తరహా చిత్రమట..!

Mon 18th Nov 2019 02:24 PM
paraari,movie,audio,launch,highlights  ‘పరారి’ ఆ తరహా చిత్రమట..!
Paraari Movie Audio Launch Highlights ‘పరారి’ ఆ తరహా చిత్రమట..!
Advertisement

ఫ్యామిలీ తో కలసి చూసే సినిమా .. పరారి ఆడియో లాంచ్ లో హీరో సుమన్

యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పరారి’. ‘‘రన్‌ ఫర్‌ ఫన్‌’’ అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న గిరి ఈ సినిమాతో నిర్మాతగా మారి ఒక ఎంటర్ టైనర్ ని అందిస్తున్నారు.  హీరో సుమన్ ముఖ్య అతిథిగా పరారి ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. 

రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో పరారి ఆడియో లాంచ్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 

రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘‘యోగీశ్వర్ డాన్స్ బాగుంది. సాంగ్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. చక్రిని, మహిత్ గుర్తు చేసాడు.  మహిత్   వర్క్ చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ ఫంక్షన్ కి రావడానికి చక్రి గారు ఒక కారణం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ... ‘‘చిన్న సినిమా  అని ఎక్కడా అనుకోవడానికి లేకుండా ఈ సినిమా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని తెలుస్తుంది. యోగీశ్వర్ పేరులోనే పవర్ ఉంది. నిర్మాత గిరి గారు పర్మినెంట్ ప్రొడ్యూసర్ అవుతారు అనిపిస్తుంది’’ అన్నారు.

నిర్మాత  దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘‘మూడు జనరేషన్స్ ఇలా వేదిక మీద చూడటం హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్ గిరి తన తనయుడుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.  గిరి గారి నాన్న గారు ఈ వేడుకలో భాగం అవ్వడం, ఈ మూడు జనరేషన్ లను చూడటం హ్యాపీగా ఉంది. యోగీశ్వర్ కి చాలా మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు.

నటుడు  శ్రవణ్ మాట్లాడుతూ... ‘‘గిరి గారు నాకు ఫ్యామిలీ మెంబెర్ లాంటి వారు. నన్ను ఫైనాన్షియల్ గా గైడ్ చేసేవారు. సినిమా తీస్తున్నారు అనగానే మొదట నేను అంతగా ఇష్ట పడలేదు. కానీ యోగీశ్వర్ టాలెంట్ ఏంటో సెట్స్ లో తెలిసింది. నా పాత్ర చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఈ సినిమా ఔట్ పుట్ చూసాక చాలా సంతోషంగా ఉంది.  నిర్మాతకు పదింతలు డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ముఖ్య అతిథిగా వచ్చిన హీరో  సుమన్ గారు మాట్లాడుతూ...  ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. గిరి నాకు అభిమాని మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబెర్. నా సక్సెస్ లోనే కాదు, ప్రతి సందర్భంలోనూ గిరి నాతో ఉన్నాడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం.

నా వందో సినిమా చేయాలని గిరి ట్రయ్ చేసాడు. కానీ కుదరలేదు. గిరి తన కొడుకు యోగీశ్వర్ ని ఇంట్రడ్యూస్ చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు అది నా బాధ్యత  అనుకున్నాను. యోగీశ్వర్ డాన్స్ లు, ఫైట్స్ లో బాగా పేరు రావాలని ప్రయత్నించాము. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకున్నాము. గరుడ వేగ అంజి, ఫైట్ మాస్టర్ నందులను తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీతో కలసి వెళ్లే సినిమాగా ఉండాలని తీర్చిదిద్దాం. ఏ సినిమా  విజయం అయినా  ఆడియోతోనే మొదలవుతుంది. అందుకే మహిత్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మాకు సగం విజయం దక్కింది అనుకుంటున్నాం. యోగీశ్వర్ అందరికీ నచ్చుతాడు అందరినీ ఎంటర్ టైన్ చేస్తాడు’’ అన్నారు.

మహిత్ నారాయణ్ మాట్లాడుతూ... ‘‘చక్రి గారు నాకు అన్నయ్యే కాదు గురువు కూడా, ఆయన పేరుని తీసుకొని నేను నా ప్రయాణం మొదలు పెట్టాను. పరారితో నాకు ఒక మంచి టీంతో వర్క్ చేసే అవకాశం దక్కింది. నిర్మాత గిరి గారుతో నాకు చాలా సంవత్సరాలు అనుబంధం ఉంది. యోగిని హీరోని చేద్దాం అనుకున్నప్పుడు నేను కూడా ఒక బాధ్యతగా తీసుకున్నాను. ఇప్పుడు అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గిరి గారు నా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకున్నాను అనిపిస్తుంది’’ అన్నారు.

దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ... ‘‘ఈ కథ వెనుక మూడేళ్ల కష్టం ఉంది. ఈ కథను ఎక్కడా  కాంప్రమైజ్ కాలేదు. నా కథకు బెస్ట్ సపోర్ట్ నిచ్చారు. ఒక పెద్ద టెక్నికల్ టీంతో వర్క్ చేయడం నా అదృష్టం. మహిత్ గారి మ్యూజిక్ ఆయన ఇచ్చిన సపోర్ట్ పరారికి పెద్ద సపోర్ట్ గా నిలిచింది. నిర్మాత గిరి గారు బెస్ట్ ప్రొడ్యూసర్ గా నిలుస్తారు’’ అన్నారు.

హీరో  యోగీశ్వర్ మాట్లాడుతూ... ‘‘నేను హీరోగా ట్రయ్ చేయడానికి కారణం  హీరోగా మారడానికి మా నాన్న గారే కారణం. హీరో సుమన్ గారితో  స్క్రీన్ షేర్ చేసుకుంటానని అనుకోలేదు. అది నా అదృష్టం. మా డిఓపి అంజి గారు, ఫైట్ మాస్టర్ నందు గారు ఇచ్చిన సపోర్ట్ సూపర్బ్. మంచి ఎంటర్టైనర్ ని అందించబోతున్నాం, నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ కోసం చాలా మంది మా వెనకాల నిలబడ్డ అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిర్మాత గిరి మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాని ఎక్కడా లెక్కలు వేసుకొని నిర్మించలేదు. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని అందించాం. సుమన్ గారు నా అభిమాన హీరో, కానీ ఈ సినిమా చూసాక నా కొడుకు ఫ్యాన్ అయ్యాను. ఏదో చేస్తాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. చాలా సర్ప్రైజ్ అయ్యాను. చక్రి గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. చక్రి కోసమే మహిత్ కి అవకాశం ఇచ్చాను. నా నమ్మకం నిలబెట్టారు. సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాము’’ అన్నారు.

‘పరారి’ చిత్రంలో యోగేశ్వర్‌, అతిథి, సుమన్‌, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రావణ్‌, మకర్‌దేశ్‌ పాండే, జీవా, కల్పలత తదితరులు నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గురుదేవగా అంజి, ఎడిటర్‌: గౌతమ్‌ రాజు, కొరియోగ్రఫి: జానీ, భాను, ఫైట్స్‌: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: జీవివి. గిరి, దర్శకత్వం: సాయి శివాజీ.

Paraari Movie Audio Launch Highlights:

Celebrities Speech at Paraari Movie Audio Launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement