ఈ మధ్యన టాలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోల మధ్యన చీకట్లో లోపాయకారి ఒప్పందం కుదిరిందని.. దానితో నిర్మాతలు సేఫ్ అంటూ వార్తలొచ్చాయి. అల్లు అర్జున్ - మహేష్ బాబు రహస్య మీటింగ్ పెట్టుకుని జనవరి 12న విడుదల కావాల్సిన ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ సినిమాల విషయంలో ఓ ఒప్పందానికి వచ్చి.. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా డేట్ మార్చుకుని జనవరి 11కి రావడానికి రెడీ అవుతున్నారని అన్నారు. అయితే ఈ మీటింగ్‌లో మహేష్ తగ్గాడని, అల్లు అర్జున్ సేఫ్ అయ్యాడని అన్నారు. ఇక రెండు సినిమాల నిర్మాతలు రిలీఫ్ అయ్యారని కూడా ప్రచారం జరిగింది.
అయితే దిల్ రాజు పర్యవేక్షణలో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే అని.. కాకపోతే మహేష్ బాబు మాత్రం మెట్టు దిగలేదని, తన సినిమాని ముందు విడుదల చెయ్యడానికి ఒప్పుకోలేదని, ఇక అల్లు అర్జున్ కూడా తన సినిమా జనవరి 12న అంటున్నాడని తాజా సమాచారం. మహేష్ మాత్రం డేట్ మార్చేది లేదంటున్నాడట. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటికే F2 తో బంపర్ హిట్ కొట్టేసాడు. ఇక తన సినిమాకి యావరేజ్ టాక్ పడినా సినిమా ఆడుతుందని.. నిర్మాతలకు భయం లేదని భరోసా ఇస్తున్నాడట. కానీ అల్లు అర్జున్ నిర్మాతలు మాత్రం ఎవరో ఒకరు తగ్గితే బాగుంటుందని అంటున్నారట.