‘వెంకీమామ’లో ‘ఎన్నాళ్లకో.. ’ సాంగ్ రేపు విడుదల
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వెంకీమామ’. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. కాగా నవంబర్ 16న రెండో సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ‘ఎన్నాళ్లకో..’ అంటూ సాగే ఈ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో వెంకటేష్ ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో పాయల్ రాజ్‌పుత్ కూడా ఉంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రోసాంగ్ ఇది. మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్