Advertisementt

రాజ్ తరుణ్ సినిమాలో హెబ్బా..!

Fri 15th Nov 2019 09:31 PM
hebah patel,key role,raj tarun,orey bujjigaa  రాజ్ తరుణ్ సినిమాలో హెబ్బా..!
Hebah Patel in Raj Tarun New Movie రాజ్ తరుణ్ సినిమాలో హెబ్బా..!
Advertisement
Ads by CJ

‘ఒరేయ్ ...బుజ్జిగా’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్ హెబ్బాప‌టేల్‌

‘ఏమైంది ఈ వేళ‌’, ‘అధినేత‌’, ‘బెంగాల్ టైగ‌ర్‌’, ‘పంతం’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి ‘ఖైదీ’ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్. ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం. ‘ఒరేయ్ బుజ్జిగా’. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో ఈ రోజు నుండి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర‌ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ‘‘మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క‌మైన పాత్ర‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.  ఈ సంద‌ర్భంగా క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హెబ్బాప‌టేల్‌కు థ్యాంక్స్‌. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్  తెర‌కెక్కిస్తున్నారు’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బాప‌టేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Hebah Patel in Raj Tarun New Movie:

Hebah Patel Key Role in Orey Bujjigaa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ