Advertisementt

రేపు రిలీజ్ కాబోతోన్న సినిమాల పరిస్థితి ఏంటో?

Fri 15th Nov 2019 11:03 AM
tenali ramakrishna babl,action,vijay sethupathi,tollywood,box office,friday  రేపు రిలీజ్ కాబోతోన్న సినిమాల పరిస్థితి ఏంటో?
This Friday Release Movies Details రేపు రిలీజ్ కాబోతోన్న సినిమాల పరిస్థితి ఏంటో?
Advertisement
Ads by CJ

రేపు(శుక్రవారం) విడుదలకు సిద్దమైన సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి కనిపించడంలేదు. కారణం సందీప్ గత సినిమాల ప్లాప్స్ వలన, అతని మార్కెట్ దారుణంగా పడిపోయింది. సందీప్ గత చిత్రం ‘నిను వీడని నీడని నేనే’ సినిమా బాగున్నప్పటికీ... ప్రమోషన్స్ లేక కలెక్షన్స్ రాలేదు. అయితే సందీప్ కిషన్ తన ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ సినిమాలో క్లైమాక్స్ కోసం సినిమా చూడాలి, అలాగే సినిమాలో హీరోయిన్ హన్సిక, ఇంకా సినిమాలో బోలెడన్ని చూడాల్సినవి ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. సినిమాపై అనుకున్నంతగా క్రేజ్ రావడం లేదు. సినిమా టాక్ బాగుండి, కామెడీ వర్కవుట్ అయితే మాత్రం కొన్ని రోజులు ఈ సినిమా మార్కెట్‌లో నిలబడే అవకాశాలు ఉన్నాయి.

బుక్ మై షో లో సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’కి పెద్దగా బుకింగ్స్ కనిపించడం లేదు. మరోపక్క వరస హిట్స్ కొడుతూ తెలుగు మార్కెట్‌లోనూ దడదడలాడిస్తున్న విశాల్ యాక్షన్ సినిమాతో పోటీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో తమన్నా అందాలే హైలెట్ అనేలా తమన్నా అందాల ఆరబోత ఉందని ట్రైలర్, టీజర్ లోను కనిపిస్తుంది. మరోపక్క సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి సందీప్ కిషన్‌కి ఈ సినిమా హిట్ అయితే హీరోగా మార్కెట్ నిలబడుతుంది. లేదంటే లేదు. 

ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ సేతుపతి నటించిన ‘విజయ్ సేతుపతి’ చిత్రం కూడా టాలీవుడ్‌లో విడుదలకాబోతోంది. ఈ సినిమాపై కూడా అంతగా అంచనాలు లేవు. కాకపోతే విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. మరి ఈ మూడు చిత్రాలలో రేపు బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం నిలబడుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ..!

This Friday Release Movies Details:

Tenali Ramakrishna BABL vs Action vs Vijay Sethupathi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ