Advertisementt

ర‌వితేజ 66వ చిత్రం ‘క్రాక్’..మొదలైంది

Thu 14th Nov 2019 08:00 PM
krack,raviteja,shruti haasan,raviteja 66th film,gopichand malineni,tagore madhu,movie opening  ర‌వితేజ 66వ చిత్రం ‘క్రాక్’..మొదలైంది
Raviteja 66th Film Krack Film Launched ర‌వితేజ 66వ చిత్రం ‘క్రాక్’..మొదలైంది
Advertisement
Ads by CJ

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి ‘క్రాక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్‌.వి. ప్ర‌సాద్‌, సురేంద‌ర్ రెడ్డి, రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్‌, సుధాక‌ర్ రెడ్డి, న‌వీన్ ఎర్నేని, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, దాము, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌, రామ్ తాళ్లూరి త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు, సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్‌. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ర‌వితేజ క్యారెక్ట‌ర్‌లోని ప‌వ‌ర్‌ను సూచించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా క్యారెక్ట‌ర్ ప‌రంగా ర‌వితేజ గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో ఉన్న డిఫ‌రెంట్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ.. ‘‘మా ‘క్రాక్‌’ మూవీ ఓపెనింగ్‌కి వ‌చ్చిన అతిథులంద‌రికీ థ్యాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ‌ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్స్ క‌థ‌. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘మెర్స‌ల్‌’, ‘బిగిల్‌’ వంటి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.

 

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

నిర్మాత‌: బి.మ‌ధు

బ్యాన‌ర్‌: స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు

డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

కో ప్రొడ్యూస‌ర్‌: అమ్మిరాజు కానుమిల్లి

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

ఫైట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌

పాట‌లు: రామ‌జోగ‌య్య‌శాస్త్రి

మేక‌ప్‌: శ్రీనివాస‌రాజు

కాస్ట్యూమ్స్‌: శ్వేత‌, నీర‌జ కోన‌

స్టిల్స్‌: సాయి

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌: వ‌ర్కింగ్ టైటిల్ శివ‌

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌

కో డైరెక్ట‌ర్స్‌: గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: పీవీవీ సోమ‌రాజు

Raviteja 66th Film Krack Film Launched:

Ravi Teja, Shruti Haasan, Gopichand Malineni, Tagore Madhu’s Krack Launched Grandly

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ