Advertisementt

‘అల’.. నుంచి చిల్డ్రన్స్ డే స్పెషల్ ఇదే!

Thu 14th Nov 2019 07:47 PM
allu arjun,ala vaikunthapurramloo,chidrens day,special song,omg daddy  ‘అల’.. నుంచి చిల్డ్రన్స్ డే స్పెషల్ ఇదే!
OMG Daddy Song Teaser Review ‘అల’.. నుంచి చిల్డ్రన్స్ డే స్పెషల్ ఇదే!
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురములో ప్రభంజనం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రెండు పాటలతో సినిమాని ఆకాశానికి చేర్చిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు మరో సాంగ్ టీజర్ లోను దుమ్ము దులిపాడు. థమన్ మ్యూజిక్ ఓ ఎత్తైతే.... రెండు రోజుల నుండి సర్ప్రైజ్ అంటూ ఊరిస్తున్న అల్లు అర్జున్.. తన పిల్లలు ఆయాన్, అర్హలతో ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ కోసం బుల్లి బుల్లి స్టెప్స్ వేయిచడం మరో ఎత్తు. మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఇచ్చిన ఈ బుల్లి సర్ప్రైజ్  అదిరిపోయింది. ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ కోసం అల్లు ఆయాన్, అర్హలు తన తండ్రి అల్లు అర్జున్ ఫోటోని చూస్తూ  ఫన్నీగా తల బాదుకోవడం మాత్రం అబ్బ అబ్బ పిచ్చ క్యూట్ గా ఉంది.

బుల్లి అడుగులు వేస్తూ అర్హ, అల్లు అర్జున్ ఫోటో దగ్గర నిలబడి ఇచ్చిన క్యూట్ అండ్ స్వీట్ ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. ఇక అల్లు అయాన్ టీజర్ చివర్లో వేసిన స్టెప్ కూడా ఈ ‘ఓ మై గాడ్ డాడీ…’  సాంగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అల్లు అర్జున్ తన క్యూట్ అండ్ స్వీట్ డార్లింగ్స్ తో చిల్డ్రన్స్ డే రోజున మెగా ఫ్యాన్స్ కి మరిచిపోలేని ట్రీట్ ఇచ్చాడు. ఇక ఆ సాంగ్ లో అయాన్, అర్హల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్స్ అలాగే సాంగ్ లిరిక్ కూడా అదిరిందనే చెప్పాలి. మరి పాటలతోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్న అల వైకుంఠపురములో టీం టీజర్, ట్రైలర్ తో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Click Here for Song Promo

OMG Daddy Song Teaser Review:

OMG Daddy Song Teaser: Cute n Charming  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ