Advertisementt

లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’ విడుదల తేదీ ఫిక్స్

Wed 13th Nov 2019 04:20 PM
trap,trap release date,brahmaji,trap telugu movie  లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’ విడుదల తేదీ ఫిక్స్
Trap Movie Release Date fixed లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’ విడుదల తేదీ ఫిక్స్
Advertisement
Ads by CJ
>నవంబర్ 22న లవ్ థ్రిల్లర్ ‘ట్రాప్’

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానర్ లో మహేందర్ ఇప్పలపల్లి, షాలు, కాత్యాయనీ శర్మ హీరో హీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో రూపొందిన  క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రాప్’. ఈ చిత్రం ద్వారా ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్నారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 22‌న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు వీఎస్ ఫణింద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ చెప్పగానే వెంటనే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న నిర్మాత ఆళ్ల స్వర్ణలత గారికి థ్యాంక్స్. అలాగే మా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాజీ గారికి కృతజ్ఞతలు. ఆయనకు ‘సింధూరం’ సినిమా ఎలా మంచి పేరు తీసుకువచ్చిందో నాకు ఈ చిత్రం అలా మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను. మా సినిమాలో మంచి పాటలు ఇచ్చిన ఈశ్వర్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హర్షకు ధన్యవాదాలు’’ అన్నారు.  

నిర్మాత ఆళ్ల స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొదట నిర్మాణ రంగంలోకి రావాలంటే చాలా భయం వేసింది. కానీ హీరో, హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా దర్శకుడు ఫణింద్ర సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. నవంబర్ 22న మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

Trap Movie Release Date fixed :

Trap Movie Release on November 22

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ