నవంబర్ 14న మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్
మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రానికి ముహూర్తం కుదిరింది. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవర్‌పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో ఇన్‌టెన్స్ బ్యాగ్రౌండ్‌లో రవితేజ పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో కనపడుతున్నారు. రవితేజ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
రవితేజ, శృతిహాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: ఠాగూర్ మధు
బ్యానర్: లైట్ హౌస్ మూవీ మేకర్స్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్