Advertisementt

సుధీర్ బాబు చేతులమీదుగా ‘పిచ్చోడు’ ట్రైలర్ రిలీజ్

Wed 13th Nov 2019 10:51 AM
pichhodu movie trailer,sudheer babu,hemanth srinivas,pichhodu telugu movie  సుధీర్ బాబు చేతులమీదుగా ‘పిచ్చోడు’ ట్రైలర్ రిలీజ్
Pichhodu Movie Trailer Released సుధీర్ బాబు చేతులమీదుగా ‘పిచ్చోడు’ ట్రైలర్ రిలీజ్
Advertisement
Ads by CJ
>హేమంత్ ఆర్ట్స్ ‘పిచ్చోడు’ మూవీ ట్రైలర్ విడుదల చేసిన హీరో సుధీర్ బాబు

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా ‘పిచ్చోడు’. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్‌కు సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బాగుంది, కొత్త నటీనటులు చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. టైటిల్ క్యాచీగా ఉంది, అదే సినిమాకు సగం సక్సెస్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో నటించిన అందరు నటీనటులకు, టెక్నీషియన్స్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’’ అన్నారు.

నిర్మాత హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మా పిచ్చోడు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్ బాబుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా యూత్ ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము’’ అన్నారు.

Pichhodu Movie Trailer Released:

Sudheer Babu Launches Pichhodu Movie Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ