గత వారం రోజులనుండి వెంకీమామ లుక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వెంకటేష్, నాగ చైతన్యలు పంచె కట్టు లుక్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా స్టైలిష్ గా ఉన్న లుక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తూ.. దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషి చేస్తున్నాయి. అయితే వెంకీమామ సినిమాకి మాత్రం అనుకున్నంత బజ్ అవడం లేదు. సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ ఇచ్చిన నిర్మాతలకు ఇప్పుడు వెంకీమామ పరిస్థితి మీద డౌట్ పట్టుకుంది. వెంకటేష్ లాంటి క్రేజ్ ఉన్న హీరో, మజిలీ లాంటి హిట్ ఉన్న చైతు నటించిన సినిమాకి మార్కెట్ లో ఉన్న క్రేజ్ అంతంత మాత్రంగానే కనబడుతుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కి ఆదరణ లభించింది అని యూనిట్ చెబుతున్నప్పటికీ... ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. పాయల్ రాజపుత్ లాంటి బోల్డ్ హీరోయిన్, హాట్ గర్ల్ రాశి ఖన్నాలు హీరోయిన్ గా నటించిన సినిమా మీద ఎందుకు క్రేజ్ రావడంలేదో కూడా సురేష్ బాబుకి అంతు చిక్కడం లేదు. దర్శకుడిగా బాబీకి జై లవ కుశ లాంటి హిట్ ఉన్నప్పటికీ... ప్రస్తుతం బాబు దర్శకత్వం మీద ఎలాంటి అంచనాలు లేకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది అంటున్నారు. అలాగే మధ్యలో రీ షూట్స్, బడ్జెట్ కంట్రోల్ అంటూ వార్తలు రావడం కూడా సినిమా మార్కెట్ ని దెబ్బతీసింది.