Advertisementt

విడాకుల తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Mon 11th Nov 2019 11:13 PM
manchu manoj,hero manoj,interesting tweet,divorce,singles day  విడాకుల తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
Manchu Manoj Interesting tweet After Divorce! విడాకుల తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ కుర్ర హీరో మంచు మనోజ్.. భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో తన విడాకులకు సంబంధించి ఓ ఎమోషనల్‌ క్లారిటీ ఇచ్చుకున్నాడు. తన పెళ్లి డివోర్స్‌తో ముగుస్తోందని.. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వస్తుందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని విపరీతంగా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం.. మరోవైపు నిర్మాణ రంగంలోకి దిగుతున్నానని.. మంచి టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే విడాకుల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉండిపోయిన మనోజ్ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. సింగిల్స్ డే సందర్భంగా.. ‘హ్యాపీ సింగిల్స్ డే’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. ‘ఐ లవ్ మీ..’ అని ట్వీట్ చేశాడు. తన జీవితంలో ఇప్పుడెవరూ లేకపోవడంతో తనను తానే ప్రేమించుకుంటున్నాను అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కాగా.. మనోజ్ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేయగా.. వాటికి రిప్లై కూడా ఇచ్చాడు. ప్రవీణ్ అనే వీరాభిమాని అన్నా.. మళ్లీ మా లాగే సింగిల్, బ్యాచిలర్ లైఫ్ అంటావ్ అంటూ దండం పెడుతున్నట్లున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ఇందుకు మనోజ్ రియాక్ట్ అవుతూ.. అంతేగా.. అంతేగా నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే..  మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సింగిల్ ఆర్మీ, హ్యాపీ సింగిల్స్ డే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు మెగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు పలువురు నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

Manchu Manoj Interesting tweet After Divorce!:

Manchu Manoj Interesting tweet After Divorce!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ