గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. రమ్యకృష్ణ సహా ఎంటైర్ యూనిట్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. 30 రోజుల పాటు జరగనున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా నరేశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
ఆకాశ్ పూరి, కేతికాశర్మ, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: అనిల్ పాదూరి
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
సమర్పణ: లావణ్య
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: నరేశ్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
ఆర్ట్: జానీ షేక్
పాటలు: భాస్కర భట్ల
ఫైట్స్: రియల్ సతీశ్
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్