Advertisementt

‘క్షీర సాగర మథనం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు

Mon 11th Nov 2019 09:57 PM
ksheera saagara madhanam,anil panguluri,sundeep kishan,first look  ‘క్షీర సాగర మథనం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు
Ksheera Saagara Madhanam Title Revealed by Sundeep Kishan ‘క్షీర సాగర మథనం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు
Advertisement
Ads by CJ

‘అనిల్ పంగులూరి’ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్ర టైటిల్‌ను ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించారు. దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అద్దం పడుతూ.. తెలుగుదనం ఉట్టి పడే ‘క్షీర సాగర మథనం’ అనే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి, ప్రదీప్, కథానాయిక చరిష్మా, చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి, ప్రముఖ మహిళా నిర్మాత పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు. 

‘క్షీర సాగర మథనం’ అనే ఆహ్లాదకరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం.. టైటిల్‌కి తగ్గట్లు ఘన విజయం సాధించాలని సందీప్ కిషన్ ఆకాక్షించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ వినూత్న కథా చిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

Ksheera Saagara Madhanam Title Revealed by Sundeep Kishan:

Anil Panguluri Film Title is Ksheera Saagara Madhanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ