‘83’ చిత్రంలో కపిల్ దేవ్ ట్రేడ్ మార్క్ నటరాజ్ క్రికెట్ షాట్‌తో ఆకట్టుకుంటున్న రణ్వీర్ సింగ్
భారతదేశ క్రికెట్ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్ దేవ్ నాయకత్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజయాన్ని సాధించి క్రికెట్ విశ్వవిజేతగా భారతదేశం ఆవిర్భవించిన సంవత్సరమది. తొలిసారి ప్రపంచ క్రికెట్ కప్పును భారతావని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ‘83’ సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. ‘83’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా కోసం రణ్వీర్ సింగ్ కపిల్‌దేవ్‌లా మేకోవర్ అయ్యారు. తన శరీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవడానికి ఆయన పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. ఫ్యాన్స్ కోసం కపిల్‌దేవ్‌లా ఉన్న రణ్వీర్ సింగ్ లుక్‌ను చిత్రీ యూనిట్ విడుదల చేసింది. అది కూడా ఆయన ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ నటరాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1983 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో టన్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 పరుగులను సాధించారు. క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ మరపురాని మ్యాచ్‌గా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ఈ మ్యాచ్ లైవ్‌లో ప్రసారం కాలేదు. రికార్డు కూడా కాలేదు.
ఈ చిత్రంలో కపిల్ డేర్ డెవిల్స్ సాధించిన విజయాలను అద్భుతంగా చిత్రీకరించారు. ముంబైలో రీసెంట్‌గా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, మహీందర్ అమర్‌నాథ్‌గా షకీబ్ సలీమ్, బల్వీందర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారి, రవిశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేకర్ శర్మ, యశ్‌పాల్ శర్మగా జతిన్ శర్నా, రోజర్ బన్నిగా నిశాంత్ దహియా, సునీల్ వాల్సన్‌గా ఆర్.బద్రి, ఫరూక్ ఇంజనీర్‌గా బోమన్ ఇరాని, పి.ఆర్.మన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొనె అతిథిపాత్రలో నటిస్తున్నారు.