Advertisementt

యంగ్ డైరెక్టర్‌కు మాటిచ్చిన యంగ్ రెబల్‌స్టార్!

Mon 11th Nov 2019 02:55 PM
young rebal star prabhas,green signal,young direcror parsuram,geetha govindam  యంగ్ డైరెక్టర్‌కు మాటిచ్చిన యంగ్ రెబల్‌స్టార్!
Is Young Rebal Star Prabhas Gives Green Signal To Young Direcror! యంగ్ డైరెక్టర్‌కు మాటిచ్చిన యంగ్ రెబల్‌స్టార్!
Advertisement
Ads by CJ

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు పరశురాం మరో సినిమా అనౌన్స్ చేయలేదన్న విషయం తెలిసిందే. ఇక చోటా హీరోలు కాకుండా బడా, స్టార్ హీరోలతో సినిమా చేయాలని భావించిన పరుశురాం.. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్ బాబు‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ మహేశ్‌ డేట్స్ ఇవ్వకపోవడంతో కాసింత అసంతృప్తికి లోనైన పరుశురాం.. అదే కథను అక్కినేని కుటుంబం నుంచి సినిమాల్లోకి సింగిల్ హిట్ కోసం వేయి కళ్లతో వేచి చేస్తున్న అఖిల్‌కు కథ వినిపించాడు. అయినప్పటికీ స్టార్ హీరోలతో సినిమా చేస్తే కిక్కుంటుందని భావించిన యంగ్ డైరెక్టర్.. టాలీవుడ్‌ టాప్, స్టారో హీరోగా పేరుగాంచిన యంగ్‌ రెబల్ స్టార్‌‌పై కన్నుపడింది.

ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ఇప్పుడు వేరు గనుక.. ఆయనతోనే సినిమా తెరకెక్కించాలని భావించాడట. అంతేకాదు.. తన స్టోరీతో డార్లింగ్‌ను మెప్పిస్తే ఇక ఊహించింది జరిగినట్లేనని పరుశురాం భావిస్తున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్ కోసం ఓ మంచి స్టోరీ రాసుకున్నాడని.. మొదట సింగిల్ లైన్ వినిపించగా పర్లేదు అని చెప్పి.. ఇంకా మార్పులు చేర్పులు చాలా చేయలని డార్లింగ్ సూచించాడట. మీరు మార్పులు చూసుకొని రండి డార్లింగ్.. సినిమా కచ్చితంగా చేసేద్దేం అని పరుశురాంకు ప్రభాస్ సూచించారట. మరి ఈ స్టోరీ వినిపించడంలో ఏ మాత్రం నిజముందో..? అసలు ఇది ఎంతవరకు నిజమో..? అసలు ప్రభాస్ ఇప్పట్లో ఇలాంటి చోటా డైరెక్టర్స్.. చోటా సినిమాలు చేస్తారా లేదా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Is Young Rebal Star Prabhas Gives Green Signal To Young Direcror! :

Is Young Rebal Star Prabhas Gives Green Signal To Young Direcror!   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ