టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. ఒకప్పుడు ఆయన సినిమాలంటే జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఈయన సినిమాలు ఆదరిస్తుండేవారు. అయితే అదే మూసదోరణిలో సినిమాలు తీస్తుండటంతో బోయపాటిని పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఇందుకు చక్కటి ఉదాహరణ ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాకు ఏ రేంజ్‌లో పబ్లిసిటీ ఇచ్చారో.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత జనాలు ఏ మాత్రం ఆదరించారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. అయినా ఇవన్నీ ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం.
వాస్తవానికి భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించడానికే బోయపాటి ఆసక్తి చూపుతూ ఉండటమే కాకుండా తాను కూడా గట్టిగా పుచ్చుకోవాలని అనుకుంటాడు. ఇప్పటి వరకూ రూ. 15 కోట్లు పారితోషికం తీసుకునే బోయపాటి అనూహ్యంగా తన మనసు మార్చుకున్నాడట. తాజా చిత్రానికి గాను మునుపటి రెమ్యునరేషన్‌లో సగం మాత్రమే అనగా 8 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. ఇందుకు కారణం.. తన వల్ల నిర్మాతకు మరీ భారం కాకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాగా.. తన తదుపరి చిత్రంలో బాలీవుడ్ అ్రగనటుడు సంజయ్ దత్‌తో పాటు భారీ తారాగణాన్ని తీసుకోవాలని యోచిస్తున్నాడట. అందుకే మొదట తన దగ్గర్నుంచే రెమ్యునరేషన్ తగ్గించాలని భావించి పై విధంగా నిర్ణయం తీసుకున్నాడట.
ఇదిలా ఉంటే అబ్బే.. బోయపాటి రెమ్యునరేషన్ తగ్గించడమా అంత సీనేం లేదు.. వరుస సినిమాలాన్నీ అట్టర్‌ప్లాప్ అవుతుండటంతో నిర్మాతలే ఆ రేంట్ ఫిక్స్ చేశారని మరో మిక్స్‌డ్ సైతం వినిపిస్తోంది. ఫలానా రేటు అయితే తమకు ఓకే అని అంతకుమించి ఇచ్చుకోలేమని బోయపాటికి నిర్మాతలు తెగేసి చెప్పగా.. మీరు ఎంతిచ్చినా పుచ్చుకుంటానని చెప్పారట. పారితోషికం తగ్గించుకొని మరీ చేస్తున్న బోయపాటి.. తన తదుపరి సినిమాను ఏ మాత్రం తెరకెక్కించి.. జానాలను మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే మరి.