Advertisementt

క్యూట్ లవ్‌ స్టోరీతో మహేశ్ రెండో మేనల్లుడు!

Mon 11th Nov 2019 02:39 PM
mahesh babu,mahesh nephew,galla siddharth,galla ashok,cute love story  క్యూట్ లవ్‌ స్టోరీతో మహేశ్ రెండో మేనల్లుడు!
Mahesh Babu Nephew Galla Siddharth Also Comes With Cute Love Story క్యూట్ లవ్‌ స్టోరీతో మహేశ్ రెండో మేనల్లుడు!
Advertisement
Ads by CJ

ఇదేంటి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ మొదటి అల్లుడు గల్లా అశోక్ సినిమా షూటింగ్ ప్రారంభం కాక మునుపే మళ్లీ రెండో అల్లుడా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. క్యూట్ లవ్‌ స్టోరీతో రెండో అల్లుడు సిద్ధార్థ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సినిమాల్లోకి రావడానికి ఆయనకున్న క్వాలిఫికేషన్స్.. గల్లా అశోక్‌కు ఉన్న క్వాలికేషన్స్‌ను కూడా సిద్ధార్థ్ బయటపెట్టాడు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఏపీ చెందిన ప్రముఖ రాజకీయ వేత్త, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా ‘డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యమ్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా చేశారు. మహేశ్ ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ వచ్చేసిందన్న మాట. మొదటి మేనల్లుడి సినిమా కార్యక్రమాలు మొదలైన రోజే మరో ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తెలియవచ్చింది. హైదరాబాద్‌‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను కూడా సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు గల్లా రెండో కుమారుడు సిద్ధార్థ్ ప్రకటించాడు.

‘మా సొంత నిర్మాణ సంస్థలో కాకుండా అగ్ర సంస్థలో సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం పలువురు దర్శకులు తీసుకొచ్చిన కథలు వింటున్నాను. త్వరలోనే ఓ క్యూట్ ప్రేమకథతో హీరోగా కనిపిస్తాను. గల్లా అశోక్ తొలి సినిమా కోసం చెన్నై, హైదరాబాద్‌లో శిక్షణ పొందాడు. చిన్నప్పట్నుంచి సినిమాలపై పెంచుకున్న ఇష్టమే మమ్మల్ని సినీ ఇండస్ట్రీకి దగ్గరచేసింది.. ఇది మాకు నిజంగా సంతోషించదగ్గ విషయం’ అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాలన్నీ స్వయంగా ఆ కుర్రాడే వెల్లడించడంతో త్వరలోనే ఎంట్రీ ఉంటుందని.. ఇక మహేశ్ వీరాభామానులు, ఘట్టమనేని ఫ్యాన్స్‌కు వరుస సినిమాలేనని చెప్పుకుంటున్నారు. కాగా.. సిద్ధార్థ్‌ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే అప్పట్లో ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్‌ కావాలంటూ టీడీపీ హడావుడి చేసినప్పుడు పార్లమెంట్ ముందుకు గల్లా కొడుకు ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Mahesh Babu Nephew Galla Siddharth Also Comes With Cute Love Story:

Mahesh Babu Nephew Galla Siddharth Also Comes With Cute Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ