Advertisementt

ఎఫ్.సి.ఏ. సభ్యులకు గుర్తింపు కార్డులు

Sun 10th Nov 2019 10:24 PM
rajasekhar,jeevitha,n shankar,fca meet  ఎఫ్.సి.ఏ. సభ్యులకు గుర్తింపు కార్డులు
Identity Cards to FCA Members ఎఫ్.సి.ఏ. సభ్యులకు గుర్తింపు కార్డులు
Advertisement
Ads by CJ

పదవులు అలంకారం కాదు బాధ్యత - ఫిలిం క్రిటిక్స్ సమావేశంలో హీరో రాజశేఖర్

పదవులు అలంకారం కోసం కాదు చాలా బాధ్యతలతో కూడి ఉంటాయని అన్నారు హీరో రాజశేఖర్. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇన్ ఫార్మల్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాము మా అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవుల విషయంలో ఎంత బాధ్యతగా మెలగాలో అర్థమైందన్నారు. అసోసియేషన్ల విషయంలోనే ఇలా ఉంటే ఇక రాష్ర్టాలను పాలించేవారి పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. 

‘మా’ ప్రధాన కార్యదర్శి, సినీ నటి జీవిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రాగానే తన ‘తలంబ్రాలు’ సినిమాకు రివ్యూ రాసిన

గుడిపూడి శ్రీహరిగారిని చూడగానే చాలా ఆనందం వేసిందన్నారు.  పాతతరం జర్నలిస్టులను, నేటి తరం జర్నలిస్టులను ఒకే వేదికపై చూడటం చాలా ఆనందం వేసిందన్నారు. ఇలాంటి అసోసియేషన్ల బాధ్యతలు చూడటం ఒకవిధంగా గర్వకారణమన్నారు. ఈ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు తమవంతు సహాయసహకారాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ.. వ్యక్తులుగా ఏదీ సాధించలేమని, వ్యవస్థగా ఏర్పడి పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. ఇలాంటి అసోసియేషన్లు అందుకు తోడ్పడతాయన్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయాల కల్పనలో చాలా సమస్యలు ఎదురవుతాయని, కమిటీ వేసి నిర్వహిస్తే ఏ నిధులూ దుర్వినియోగం కావని సూచించారు. ఒకే వృత్తిలో ఉండేవారు రెండు అసోసియేషన్లుగా ఉండటంవల్ల చాలా సమస్యలు ఎదురవుతాయన్నారు. అందరూ ఏకతాటిపై నడిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరిల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. పాత, కొత్త సభ్యులందరికీ రాజశేఖర్, జీవిత, శంకర్ ల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు. 

అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ అసోసియేషన్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 14న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. దీని కోసం వివిధ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సినీరంగ ప్రముఖులను సత్కరించనున్నట్లు  చెప్పారు. 

ప్రధాన కార్యదర్వి ఇ. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..  సభ్యులకు ఆరోగ్యభీమా కల్పన, అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎఫ్.సి.ఎ. ఉపాధ్యక్షులు డి.జి. భవాని, సజ్జా వాసు, జాయింట్ సెక్రటరీ మరుడూరి మధు, ట్రెజరర్ భూషణ్, గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ బి.ఎ.రాజు, కార్యవర్గ సభ్యులు సాయిరమేష్, హేమసుందర్, మురళీ కృష్ణ, సునీతా చౌదరి, ముత్యాల సత్యనారాయణ, చిన్నమూల రమేష్, ఆర్డీఎస్ ప్రకాష్, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాత, కొత్త సభ్యులు దాదాపుగా హాజరయ్యారు.

Identity Cards to FCA Members:

Rajasekhar, Jeevitha, N Shankar at FCA Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ