Advertisementt

పూరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాడా..!

Sun 10th Nov 2019 09:34 PM
vijay deverakonda,puri jagannadh,attitude,arjun reddy,direction department  పూరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాడా..!
Vijay Deverakonda Fighter Movie with Puri Jagannadh పూరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాడా..!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ఇదివరకు అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్‌తో కాస్త యాటిట్యూడ్ చూపించేసాడు. ఆతర్వాత తనతో పనిచేసిన దర్శకులెవరికి విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదనే టాక్ ఉంది. అందులో నోటా దర్శకుడు, తాజాగా డియర్ కామ్రేడ్ దర్శకుడితో పాటుగా టాక్సీవాలా దర్శకుడికి కూడా విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదని ప్రచారం జరిగింది. సినిమాల మేకింగ్ విషయంలో విజయ్ దేవరకొండ వేళ్ళు పెడతాడని, చాలా మార్పులు చేర్పులు చేపిస్తాడనే ప్రచారం ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు అయితే ఈ ప్రచారం మాత్రం బాగా జరిగింది.

తాజాగా పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్న విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు. ఎందుకంటే పూరి జగన్నాధ్ కి తన కథలో కానీ, తన డైరెక్షన్ లో కానీ వేళ్ళు పెట్టే హీరోలంటే నచ్చరు. అందుకే పవన్‌తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసాక.. పవన్ కళ్యాణ్ తన డైరెక్షన్‌లో చేతులు పెట్టాడని.. ఇక పవన్ తో సినిమా చెయ్యనని చెప్పాడు. మరి ఫైటర్ విషయంలో విజయ్ దేవరకొండ గనక పూరి జగన్నాధ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేతులు పెడితే పూరి ఊరుకునే రకం కాదు. మరి పూరి దగ్గర విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు.

Vijay Deverakonda Fighter Movie with Puri Jagannadh:

Vijay Devarakonda attitude will not work at Puri Jagannadh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ