Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’.. డబుల్ ధమాకా!!

Sun 10th Nov 2019 09:08 PM
mahesh babu,double dhamaka,sarileru neekevvaru,item songs,tamanna  ‘సరిలేరు నీకెవ్వరు’.. డబుల్ ధమాకా!!
Mahesh Babu Offering Double Dhamaka ‘సరిలేరు నీకెవ్వరు’.. డబుల్ ధమాకా!!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - రష్మిక కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పాటలు త్వరలోనే అంటే ఈ నెల 16 నుంచి మార్కెట్ లో హడావిడి చెయ్యబోతున్నాయి. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను, యూత్ ని ఓ ఊపు ఊపడం ఖాయమనే టాక్ వినబడుతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడుతున్న అల వైకుంఠపురములో పాటలకన్నా సరిలేరు పాటలే అదిరిపోతాయనే నమ్మకంతో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. దేవిశ్రీ కూడా మహేష్‌కి బెస్ట్ మ్యూజిక్ ఇస్తానని మహేష్ ఫ్యాన్స్‌కి హమీ కూడా ఇచ్చాడు.

ఇక మహేష్ బాబు... రష్మికతో డ్యూయెట్స్ తో పాటుగా ఐటెం సాంగ్ లోను అదరగొట్టేస్తాడట. సరిలేరు ఐటెం పాటని దేవిశ్రీ ప్రత్యేకంగా కంపోజ్ చేసాడని, ఈ పాటతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతాయని అంటున్నారు. ఇక ఈ ఐటెం కోసం టాప్ హీరోయిన్ తమన్నా కూడా తన డాన్స్‌తో అదరగొట్టెయ్యనుంది. తాజా సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ఉండబోతున్నాయని, ఈ రెండింటీని దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు కంపోజ్ చేసి పెట్టాడట. మరి ఐటమ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ అదిరిపోయే ఐటెం మ్యూజిక్ ఇస్తే.. ఓ సాంగ్ తమన్నా ఆడుతుంది. మరో సాంగ్ కి మరో హాట్ హీరోయిన్ స్పెషల్‌గా తీసుకురాబోతున్నారట. అయితే ఈ సినిమాలో రెండు ఐటెం పాటలున్నట్టుగా బయటికి లీక్ కాకుండా కాపాడి.. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ని థ్రిల్ చెయ్యాలని చిత్ర బృందము భావిస్తోందట.

Mahesh Babu Offering Double Dhamaka:

Two item specials in Sarileru Neekevvaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ