టైటిల్ చూడగానే ఇదేంటి మీరు మరీ ఇలా అడిగేస్తు్న్నారేంటి..? అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులే కాలేసినట్లే.. ఇవన్నీ నెటిజన్ల నుంచి నివేదా థామస్‌కు ఎదురైన ప్రశ్నలండోయ్!. ఏదో సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు, కొందరు నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరిగింది..? నెటిజన్ల అసభ్యకర ప్రశ్నలకు ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో కౌంటరిచ్చింది..? నెటిజన్ల నోరు మూయించిందా..? లేదా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌డం సంపాదించుకున్న నటి నివేదా థామస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ బ్యూటీ నటించిన సినిమాలో తెలుగులో తక్కువే అయినా అమితమైన అభిమానాన్ని.. యూత్ గుండెల్లో చోటు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ‘నిన్నుకోరి’ సినిమాలో నివేదా నటనకు కుర్రకారంతా ఫిదా అయిపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘దర్బార్’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. అది కూడా రజనీకి కూతురి పాత్ర కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఎలాగైతేనేం రజనీ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.! త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఈ ముద్దుగుమ్మ సరదాగా ఫ్యాన్స్‌తో ముచ్చిటిచ్చింది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ సెషన్‌లో పాల్గొంది. చాలా మంది ఫ్యాన్స్ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసినప్పటికీ ఈమె మాత్రం విసుగుచెందకుండా బోర్‌గా ఫీలవ్వకుండా సమాధానమిచ్చింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. కొందరు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు నివేదా చాలా ఇబ్బంది పడింది.. అంతేకాదు ఒకింత ఆగ్రహానికి లోనైన ఈ భామ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.
నెటిజన్: మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా..?.. ఇంతకీ మీరు వర్జినేనా..?
నివేదా: ‘ఇలాంటి ప్రశ్నలను నేను పట్టించుకోను. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు తాను కూడా మనిషేనని గుర్తుంచుకోవాలి. కాస్త గౌరవప్రదంగా మెలగాలి’ అని మరీ ఎక్కువగా రియాక్ట్ కాకుండా స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.
నెటిజన్: మీరు నటి కాకుండా ఉంటే.. ఏమయ్యేవారు!?
నివేదా: ఎస్.. నేను ‘ఆర్కిటెక్ట్’ అయ్యుండే దాన్ని
నెటిజన్: కాస్టూమ్య్ విషయంలో మీకేమైనా పరిధులు ఉన్నాయా.. నెగిటివ్ పాత్రల్లో నటిస్తారా?
నివేదా: కథ, క్యారేక్టరైజేషన్‌కు అనుగుణంగా కాస్టూమ్స్ ఉండేలా చూసుకుంటాను. ఎస్.. నెగటివ్ పాత్రల్లో నటిస్తాను.. ‘ఎందుకు లేదు’ అని ఈ బ్యూటీ బదులిచ్చింది.
అయితే కొందరు అతి చేస్తూ వర్జిన్ అనే ప్రశ్నవేశారు కానీ నివేదా మాత్రం చాలా ఓపిగ్గానే.. ఆలోచించి ఎక్కువ వివాదాస్పదం చేయకుండానే జవాబిచ్చింది. ఈ ఒక్క ప్రశ్న తప్ప మిగిలినవన్నీ సాఫీగానే సాగాయ్.. సమాధానాలు కూడా మంచిగానే వచ్చాయ్.