Advertisementt

బాలయ్యకు ‘కుర్రతనం’ కలిసొస్తుందా!?

Sun 10th Nov 2019 02:04 PM
nandamuri balakrishna,balayya ruler,ks ravikumar,ruler movie,young balayya  బాలయ్యకు ‘కుర్రతనం’ కలిసొస్తుందా!?
News About Nandamuri Balakrishna బాలయ్యకు ‘కుర్రతనం’ కలిసొస్తుందా!?
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ దెబ్బకి బాగా సైలెంట్ అయిన బాలయ్య ‘రూలర్’ షూటింగ్‌తో దూసుకుపోతున్నాడు. డిసెంబర్ 20న ‘రూలర్’తో రూలింగ్ చేయాలని గట్టిగానే దర్శకనిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ బాలయ్య అభిమానులనే కాదు.. సినీ ప్రియులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక లుక్స్ విషయానికొస్తే.. ఫస్ట్ లుక్ మొదలుకుని ఇప్పటి వరకూ వచ్చిన లేటెస్ట్ లుక్ వరకూ అన్నీ ఇక సంబ్రమాశ్చర్యాలే!. బాలయ్య రిస్క్ చేస్తున్నాడన్నది ఫస్ట్ లుక్‌లోనే తెలిసింది. అయితే మరీ ఈ రేంజ్‌లోనా అంటూ సహ నటులే ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదిగో తాజాగా రిలీజ్ అయిన లుక్‌ను మీరూ లుక్కేయండి.. యంగ్ లుక్‌తో బాలయ్య క్రేజీగా కనిపిస్తున్నాడు. త్వరలోనే టీజర్ రిలీజ్ కానుండగా.. ఇందులో బాలయ్య స్టైలిష్ పిక్‌ను చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ స్టిల్‌లో బాలయ్య ట్రెండీ దుస్తుల్లో.. కుర్రాడిలా దర్శనమిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే బహుశా కుర్ర బాలయ్య కూడా ఇలా ఉండి ఉండరేమో మరి. ఆ రేంజ్‌లో దర్శకుడు చూపించేస్తున్నాడు. మొత్తానికి చూస్తే ఇప్పుడు టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు గట్టిగానే పోటీ ఇస్తున్నాడంటూ కామెంట్స్ వినవస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య ఇప్పటి వరకూ ఏ సినిమాకు చేయని రిస్క్‌ను.. ‘రూలర్‌’లో చేస్తున్నాడు. మరి కొత్త ప్రయోగం బాలయ్య సినిమాను.. సినీ కెరీర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్తుందో..? లేదా.. అసలు ఈ కుర్రతనం బాలయ్యకు ప్లస్ అవుతుందో.. లేదో..? లేకుంటే మొత్తానికే అట్టర్ ప్లాప్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్-20 వరకు వేచి చూడాల్సిందే మరి.

News About Nandamuri Balakrishna:

News About Nandamuri Balakrishna  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ