సంగీత దర్శకుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’ (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ళ భరణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు( బిగ్ బాస్ ఫేమ్), లక్ష్మన్(ఆర్.ఎక్స్ 100 ఫేమ్), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన నేను ఫస్ట్ టైమ్ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ‘హేజా’. ఒక మ్యూజికల్ హారర్‌గా అద్భుతమైన కథాంశంతో రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్‌తో పాటు ఆర్.ఆర్ హైలెట్‌గా నిలవనుంది. టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉండే చిత్రం. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీమిక్సింగ్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
కో - ప్రొడ్యూసర్ వి.యన్ వోలెటి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమాను దర్శకుడు మున్నా కాశి తెరకెక్కిస్తున్నారు. ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. అలాగే టెక్నికల్‌గా కూడా బాగా రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అటు ప్రేక్షకులు ఇటు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో నటి ముమైత్ ఖాన్ క్యారెక్టర్ గత చిత్రాలకు సంబంధం లేకుండా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది’’ అన్నారు.
నటీనటులు : మున్నా కాశి, తనికెళ్ళ భరణి, ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు, లక్ష్మన్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూషన్, ప్రీతం నిగమ్ తదితరులు...
సాంకేతిక నిపుణులు :
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: మున్నా కాశి
ప్రొడ్యూసర్: కెవిఎస్ఎన్ మూర్తి
సహనిర్మాత: వి.యన్ వోలెటి
బ్యానర్: వి.ఎన్.వి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: గ్యారీ బి హెచ్
పి.ఆర్.ఓ: సాయి సతీష్