Advertisementt

మహేష్ మేనల్లుడి మూవీకి నిధి గట్టిగానే...!

Sat 09th Nov 2019 02:41 PM
nidhi agarwal,ismart shankar,ashok galla,remunaration  మహేష్ మేనల్లుడి మూవీకి నిధి గట్టిగానే...!
Shocker: Nidhhi Bags Very Big Remunaration For Ashok Galla Movie! మహేష్ మేనల్లుడి మూవీకి నిధి గట్టిగానే...!
Advertisement
Ads by CJ

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.. అందుకే దీన్ని ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఒకట్రెండు హిట్‌లు వస్తే చాలు ఇక ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అంతేకాదు.. తర్వాత సినిమాకు, ఆ తర్వాత సినిమాకు మరింత పారితోషికం పెంచేస్తుంటారు. తాజాగా.. ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో పాపులరైన నిధి అగర్వాల్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌లో ముందు వరుసలోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి గుర్తింపే కాకుండా.. ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

అలా టాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ముద్దుగమ్మకు తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా పరిచయం అవుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇందులో నటించేందుకు ఎంత పుచ్చుకుంటోంది.. ఎన్ని లకారాలు పెంచేసిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అశోక్ సరసన నటించాలని ఈ భామను సంప్రదించగా గట్టిగానే పుచ్చుకోవాలని దర్శకనిర్మాతలకు తెగేసి చెప్పేసిందట. అక్షరాలా కోటి 25 లక్షలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అయితే ఆ బ్యూటీ అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పారట. అంటే ఇస్మార్ట్‌ లాంటి ఒక్క హిట్ పడితే కోట్ల ఘడించేయచ్చన్న మాట. 

వాస్తవానికి ఇస్మార్ట్ సినిమా తర్వాత రెండు యాక్షన్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ భామ ఆ రెండింటినీ కాదనుకుంది. లవ్ స్టోరీస్‌ చేయాలని నిర్ణయించుకున్న ఈ భామకు మంచి లవ్ స్టోరీనే దక్కింది. ఆశించిన స్టోరీ దక్కడంతో కాస్త రేటు కూడా పెంచేయాలని భావించి కోటి 25 లక్షలు డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో..? తెలియాల్సి ఉంది. వాస్తవానికి రెమ్యునరేషన్ ఇంత తీసుకుంటున్నా అని ఏ యాక్టర్ కూడా బహిరంగంగా చెప్పుకోరు. మరి ఈ బ్యూటీ పెదవి విప్పుతుందేమో వేచి చూడాలి మరి.

Shocker: Nidhhi Bags Very Big Remunaration For Ashok Galla Movie!:

Shocker: Nidhhi Bags Very Big Remunaration For Ashok Galla Movie!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ