విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్‌హాసన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన రీల్ లైఫ్‌లో యాక్టింగ్ పరంగా ఎంత పేరు తెచ్చుకున్నారో..? రియల్ లైఫ్‌లో అంతకు డబుల్ అపకీర్తి సంపాదించి పెట్టుకున్నాడు.! ఇందుకు కారణం ఆయనకున్న రిలేషన్ షిప్సే..! కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అన్నీ తెంచేసుకుని ఇప్పుడు సాఫీగానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు సినిమాలకు తోడు రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా వ్యవహరించాలని పార్టీ కూడా స్థాపించి హడావుడి చేస్తున్నాడు.. అయితే ఆ పార్టీ ఎంతమేరకు సక్సెస్ అవుతుంది..? అసలు ఇది జరిగే పనేనా అనేది ఇక్కడ అప్రస్తుతం.
ఇప్పటి వరకూ రిలేషన్ షిప్స్‌తో వ్యవహారాలు రోడ్డు మీదికొచ్చి.. నానా తంటాలు పడ్డారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రిలేషన్ షిప్స్‌తో ఈయన చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటిది తాజాగా మరో హీరోయిన్‌తో కమల్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్. ఇటీవల కమల్ జన్మదిన వేడుకలు చెన్నై వేదికగా గ్రాండ్‌గా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో అందరికంటే ఎక్కువగా పూజా కుమార్ హైలైట్‌గా నిలిచారు. వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన కొందరు విమర్శకులు కమల్ మళ్లీ ఇలా లీవింగ్ రిలేషన్‌లో ఉన్నాడని కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
వాస్తవానికి కమల్ బర్త్ డే వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి చారుహాసన్, శృతిహాసన్, అక్షర హాసన్, సుహాసిని సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇంతవరకూ ఓకే గానీ ఇతర నటీనటులు ఎవరూ హాజరవ్వలేదు. అయితే పూజా కుమార్ పాల్గొంది.. అంతేకాదు కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తున్నట్లు హంగామా చేసింది!. దీంతో కమల్-పూజా మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అనుకుంటున్నారు. ఇవన్నీ అటుంచితే.. వీరిద్దరికీ రిలేషన్ ఉంది కాబట్టే ‘విశ్వరూపం1’, ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ చిత్రాల్లో హీరోయిన్‌గా పూజాకు కమలే దగ్గరుండి అవకాశం ఇప్పించారని వార్తలు మరోసారి గుప్పుమంటున్నాయి. లేటు వయసులో సార్ గారికి ఈ ఘాటు ప్రేమేంటో..? అసలు వీరిద్దరి మధ్య ఏముందే ఏంటో..? ఎంతవరకు నిజమో.. కమల్-పూజాకే తెలియాలి మరి.