Advertisementt

‘వెంకీమామ‌’ టైటిల్ సాంగ్‌కి రెస్పాన్స్‌ కేక!

Sat 09th Nov 2019 01:58 PM
venky mama,title,song,released  ‘వెంకీమామ‌’ టైటిల్ సాంగ్‌కి రెస్పాన్స్‌ కేక!
Superb Response to Venky Mama Title Song ‘వెంకీమామ‌’ టైటిల్ సాంగ్‌కి రెస్పాన్స్‌ కేక!
Advertisement
Ads by CJ

‘వెంకీమామ‌’ టైటిల్ సాంగ్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్‌

విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకీమామ‌’. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్‌, అర్థ‌మ‌య్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించారు. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

న‌టీన‌టులు:

వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)

నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌

బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ

కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌

మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌

ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

పి.ఆర్‌.ఒ:  వ‌ంశీ శేఖ‌ర్‌

Superb Response to Venky Mama Title Song:

Venky Mama Title Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ