Advertisementt

‘పానిపట్‌’ విడుదల తేదీ ఫిక్సయింది

Fri 08th Nov 2019 10:00 PM
ashutosh gowariker,panipat,trailer is grand,majestic,panipat release date  ‘పానిపట్‌’ విడుదల తేదీ ఫిక్సయింది
Panipat Movie Release date fixed ‘పానిపట్‌’ విడుదల తేదీ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘పానిపట్‌’

భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్’‌. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షీలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్‌ ‘పానిపట్‌’ సినిమా నుంచి క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ‘అహ్మద్‌ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్‌ క్యారెక్టర్‌ని చూపించారు.. ఆయన బాడీ లాంగ్వేజ్‌ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌గా రూపొందిన ‘పానిపట్‌’ చిత్రం డిసెంబర్‌ 6న విడుదలవుతుంది.

దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ మాట్లాడుతూ - ‘‘ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సినిమా అంతకు మించి అంచనాలను మించేలా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత సునీతా గోవారికర్‌ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ను ఆదరించినట్లే సినిమాను ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ గ్రూప్‌ సీఇఒ షిబాసిష్‌ సర్కార్‌ మాట్లాడుతూ.. ‘‘అశుతోష్‌తో అసోసియేట్‌ అవ్వడం హ్యాపీగా ఉంది. ఇది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటి’’ అన్నారు.

విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు రోహిత్‌ షేలత్కర్‌ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ సమాజానికి చెందిన నేను, మరాఠా ఇతిహాసాల కథలను తెరపైకి తీసుకురావాలని ఆకాంక్షించాను. అశుతోష్‌ గోవారికర్‌తో ఈ అనుబంధం - జోధా అక్బర్‌, స్వదేస్‌ మరియు లగాన్‌ వంటి ప్రముఖ చిత్రాల దర్శకుడు ఒక కల నిజమైంది’’ అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌-అతుల్‌, కెమెరా: సి.కె.మురళీధరన్‌, ఎడిటింగ్‌: స్టీవెన్‌ బెర్నార్డ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌, యాక్షన్‌: అబ్బాస్‌ అలీ మొఘల్‌,  బ్యానర్స్‌: అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్‌: సునీతా గోవారికర్‌, రోహిత్‌ షేలత్కర్‌. దర్శకత్వం: అశుతోష్‌ గోవారికర్‌.

Click Here for Trailer

Panipat Movie Release date fixed:

Ashutosh Gowariker’s Panipat Trailer is Grand and Majestic!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ