తెలుగులో ఆఫర్స్ లేని కియారా అద్వానీ బాలీవుడ్‌లో మాత్రం చెలరేగిపోతుంది. ఒకే ఒక్క సినిమా ఆమె లైఫ్‌ని మార్చేసింది. కబీర్ సింగ్ లాంటి బోల్డ్ సినిమాతో తెగ ఫేమస్ అయిన కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె డేట్స్ కావాలంటే కాస్త సమయం మాత్రం పట్టడం గ్యారెంటీ. అంతటి క్రేజ్‌తో కియారా ఉంది. అయితే తాజాగా కియారా అద్వానీని తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఓ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా కోసం సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. కాస్త భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా... వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్ కూడా పూర్తవడంతో... ఇక హీరోయిన్‌ని ఫైనల్ చేసి సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుదామనుకుంటే.... కియారా అద్వానీని సంప్రదించిన వారికీ... కాస్త డేట్స్ సర్దుబాటు చేసుకుని చెబుతా అందట. కానీ కియారా డేట్స్ సర్దుబాటు చేసుకుని వరుణ్ తేజ్ కోసం రావాలంటే ఇంకాస్త టైం పడుతుండడంతో.. వరుణ్ తేజ్ ఇక ఆమె కోసం ఆగలేం.. వేరొక హీరోయిన్‌ని చూడమని చిత్ర బృందానికి చెప్పినట్టుగా టాక్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా అన్ని రెడీ అయినా.. హీరోయిన్ కోసం వెయిటింగ్ అంటే బావుండదని... కియారా ప్లేస్ కి మరో హీరోయిన్ వెతికే పనిలో యూనిట్ ఉందట.