రాహుల్ సిప్లిగంజ్.. ఒకప్పుడు చిన్నపాటి సింగర్ ఇప్పుడిదే పేరు అటు గూగుల్‌లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఇందుకు కారణం తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌లో విన్నర్‌గా నిలవడటమే. వాస్తవానికి రాహుల్ గెలిచే అవకాశాలు 40% ఉన్నాయని అందరూ భావించారు. అయితే కచ్చితంగా గెలుస్తాడని కానీ టైటిల్ కొట్టేస్తాడని మాత్రం బహుశా ఆయన వీరాభిమానులు, కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉండరు. హౌస్‌లో ఎప్పుడు సోమరిపోతులాగా, నెగ్లిజెన్సీగా ఉండటంతో అబ్బే.. రాహుల్‌కు అంత సీన్లేదబ్బా అని క్రిటిక్స్ బాగా తిట్టిపోశారు!. ఎవరూ ఊహించని విధంగా.. సింపుల్‌గా సిప్లిగంజ్ విన్నర్‌గా ఎలా నిలిచాడు..? ఈ విన్నింగ్ ఏం జరిగిందా..? నిజంగానే నిశ్శబ్ధ యుద్ధం జరిగిందా..? ఈ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించింది వైసీపీనేనా..? వీరాభిమానులే గెలిపించారా..? అనే విషయాలు www.cinejosh.com లో తెలుసుకుందాం.
పవన్ ఫ్యాన్స్ ఓడారు..!
అవును.. మీరు అనుకున్నట్లుగానే రాహుల్ గెలుపు వెనుక అక్షరాలా వైసీపీ కార్యకర్తలు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకూ సీజన్-1లో శివబాలాజీ, సీజన్‌లో-2లో కౌశల్ వీరిద్దరూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చే వాళ్లే. అందుకే వాళ్లిద్దర్నీ పవన్ అభిమానులు, మెగాభిమానులు, బిగ్‌బాస్ ప్రియులు తలో ఓ చేయేసి గెలిపించేశారు. అయితే సీజన్-3లోనూ పవన్ వీరాభిమానులు ఉన్నారు.. హిమజ, యాంకర్ శ్రీముఖి ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. ఈసారి కూడా పవన్ ఫ్యానే గెలవాలని.. అభిమానులు గట్టిగానే ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు.
జగన్ ఫ్యాన్స్ గెలిచారు!
సరిగ్గా ఎన్నికల టైమ్‌లో వైఎస్ జగన్ కోసం రాహుల్ సిప్లిగంజ్ ఓ పాట పాడటం అది బాగా వైసీపీ వీరాభిమానులకు కనెక్ట్ అవ్వడంతో ఫిదా అయ్యారు. దీంతో ఆయన రుణమెలా తీర్చుకోవాలని భావించిన జగన్ ఫ్యాన్స్‌కు ఇలా బిగ్‌బాస్ ఓట్ల రూపంలో తీర్చేశారు. అది కూడా హంగామా చేయకుండా.. ఎక్కడా హడావుడి కనిపించకుండా నిశ్శబ్ధంగానే యుద్ధం చేసి రాహుల్‌ను గెలిపించి విన్నర్‌గా గెలిపించి బయటికి తీసుకొచ్చారు. వాస్తవానికి రాహుల్ సిప్లిగంజ్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినప్పుడే.. విన్నర్‌గా బయటికి తీసుకురావాలని ఫిక్స్ అయిన వైసీపీ వీరాభిమానులు అప్పట్నుంచే ప్రయత్నాలు షురూ చేసుకుంటూ కోట్లాది మంది ఓట్లేసి దుమ్ముదులిపారు. దీంతో రాహుల్ విన్నర్‌గా నిలిచాడు. సో.. మొత్తమ్మీద చూస్తే వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులే రాహుల్ గెలుపులో కీలక పాత్ర పోషించారన్న మాట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విన్నర్ అయ్యాక చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయం ఎక్కడైనా రాహుల్ పెదవి విప్పుతాడో..? లేకుంటే మిన్నకుండిపోతాడో వేచి చూడాల్సిందే మరి.