Advertisementt

విశాల్‌ ‘యాక్షన్‌’ సాంగ్ అదిరింది

Thu 07th Nov 2019 03:54 PM
action,vishal,tamanna,song,good response  విశాల్‌ ‘యాక్షన్‌’ సాంగ్ అదిరింది
Action Movie Song Released విశాల్‌ ‘యాక్షన్‌’ సాంగ్ అదిరింది
Advertisement
Ads by CJ

మాస్‌ హీరో విశాల్‌ ‘యాక్షన్‌’ చిత్రంలోని పాటకు గుడ్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌ 15 న  విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లిరికల్‌ వీడియోను బుధవారం విడుదల చేశారు. ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా..అన్ని మరుస్తున్నా.. నిన్ను తలుస్తున్నా..’ అంటూ సాగే పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా హిప్‌హాప్‌ తమిళ అద్భుతంగా స్వరపరిచారు. ఎం.ఎం.మానస ఈ పాటను గానం చేశారు. ఇటీవల డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా విడుదలైన ‘యాక్షన్‌’ ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 15 న  విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: శ్రీనివాస్‌ ఆడెపు, దర్శకత్వం: సుందర్‌ సి.

Click Here for Song

Action Movie Song Released:

Superb Response to Action Movie Song 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ