పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చేస్తున్నట్టు.. దిల్ రాజు - బోణి కపూర్ లు ఆ సినిమా నిర్మిస్తున్నట్టు.. ఆ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ధ్రువీకరించాడు. అదే విషయం ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అధికారికంగా ప్రకటించాడు. ఇక అప్పటినుండి పవన్ రెమ్యునరేషన్ పై అనే గాలి వార్తలు బయలుదేరాయి. ఇక హీరోయిన్ కూడా నయనతార అని, పూజా హెగ్డే అని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే పింక్ రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ అని అందరూ ఫిక్స్ అయిన టైం లో... తన అనుమతి లేకుండా ఇలాంటి ప్రకటనలు ఎలా ఇస్తారంటూ.. పవన్ కళ్యాణ్, బోనీ కపూర్ పై ఫైర్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
అసలు తనని సంప్రదించకుండా తరుణ్ ఆదర్శ్ పింక్ రీమేక్ విషయం ఎలా ప్రకటిస్తారని, అలాగే తాను 50 కోట్ల రెమ్యునరేషన్ ఎవరిని అడగలేదని, నేను ఏ నిర్మాతలను రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టలేదని, అలాగే హీరోయిన్ గా నయనతార, పూజా హెగ్డే అని ఎలా చెబుతారని పవన్ కళ్యాణ్ నిర్మాతలపై ఫైర్ అయినట్లుగా సమాచారం. తన విషయంలో వస్తున్న అసత్య వార్తలను మీరెందుకు ఖండించడం లేదని నిర్మాతలను పవన్ సూటిగా ప్రశ్నించినట్లుగా ఫిలింనగర్‌లో టాక్.
అలాగే పింక్ రీమేక్ నచ్చిందని చెప్పాను.. అలాగే ఆ సినిమా గురించి ఆలోచిస్తా అన్నా కానీ.... నేను నటిస్తా అని చెప్పలేదు అని దిల్ రాజు, బోనీ కపూర్‌లను పవన్ కళ్యాణ్ కడిగేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే పవన్ చెప్పకుండా ఇలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. మరి ఈ న్యూస్‌లో ఎంత నిజముందో తెలియదు కానీ... పవన్ ఇలా షాకిచ్చాడేమిటి అంటూ పవన్ ఫ్యాన్స్ మాత్రం బాగా వర్రీ అవుతున్నారు.