Advertisementt

పవన్ కళ్యాణ్‌పై మరో వార్త ప్రచారంలోకి..!

Wed 06th Nov 2019 10:25 PM
pawan kalyan,remuneration,dil raju,venu sri ram,powerstar  పవన్ కళ్యాణ్‌పై మరో వార్త ప్రచారంలోకి..!
One More Gossips on Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్‌పై మరో వార్త ప్రచారంలోకి..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ అనే న్యూస్ కన్ఫర్మ్ అయ్యిందో లేదో... పవన్ కొత్త సినిమా న్యూస్ సోషల్ మీడియాని ఊపిరాడనివ్వడం లేదు. ఎలా అంటే.. పవన్ కళ్యాణ్ సరసన ఈ హీరోయిన్ నటిస్తుంది, పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం డైట్ చేస్తున్నాడు ఇలా రోజుకి కాదు గంటకో న్యూస్ ప్రచారంలోకొస్తుంది. పవన్ కళ్యాణ్ - దిల్ రాజు - వేణు శ్రీరామ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కానీ.. ఈలోపు సినిమాపై ఎన్ని గాసిప్స్ వినాల్సి వస్తుందో అంటున్నారు.

తాజాగా పవన్ రెమ్యునరేషన్ పై మరో వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫీ 40 కోట్లని...అంతేకాకుండా సినిమా లాభాల్లో 25 శాతం వాటా కావాలని పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా నిర్మాతలని డిమాండ్ చెయ్యకుండా... పవన్ కళ్యాణ్ తరుపున కొంతమంది వకాల్తా పుచ్చుకుని నిర్మాతలను బెదరగొడుతున్నారట. మరి పవన్ క్రేజ్ ముందు నిర్మాతలు ముందు కాస్త తడబడినా.. ఆయన ప్రపోజల్‌కి ఒప్పుకున్నట్టే అనే టాక్ వినబడుతుంది. మరి కొత్తగా మొదలవుతున్న సినిమా ఒక్కదానికే కాదట.. పవన్ తదుపరి సినిమాలకు ఈ కండిషన్స్ అప్లై చేస్తున్నారని వినికిడి. 

One More Gossips on Pawan Kalyan Remuneration:

Pawan Kalyan Re Enters to Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ