Advertisementt

చెర్రీతో ఈ బ్యూటీ ప్లాప్.. వరుణ్‌తో వర్కవుటయ్యేనా!

Wed 06th Nov 2019 02:01 PM
mega heros,ramcharan,vinaya vidheyar rama,varun tej,kiara advani  చెర్రీతో ఈ బ్యూటీ ప్లాప్.. వరుణ్‌తో వర్కవుటయ్యేనా!
News About Mega Hero Varun Tej New Movie! చెర్రీతో ఈ బ్యూటీ ప్లాప్.. వరుణ్‌తో వర్కవుటయ్యేనా!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హాట్ బ్యూటీ కైరా అద్వాణికి టాలీవుడ్‌లో గట్టిగానే ఆఫర్లు వస్తున్నాయ్. హైదరాబాద్‌ నుంచి ముంబైకు వెళ్లి మరీ ఈ బ్యూటీని దర్శకనిర్మాతలు పట్టుకొస్తున్నారు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ్లాక్ బ‌స్టర్ చిత్రం ‘భ‌ర‌త్ అను నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత రామ్‌చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే సినిమానే ఆశించిన స్థాయికంటే ఘోరంగా ఫెయిల్ అయ్యింది.! అలా.. చేసింది రెండు సినిమాలో అయినా ఈ భామకు అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. తన నటన, అంద చెందాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీని ఎప్పుడెప్పుడో మళ్లీ తెలుగు తెరపై చూస్తామా..? అని సినీ ప్రియులు వేచి చూస్తున్నారు.  

ఈ క్రమంలో మెగా హీరో.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ సరసన కైరా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. వైవిధ్యమైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్న మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న విషయం విదితమే. చిత్రంలో హీరోయిన్ ఎవర్ని తీసుకోవాలని ఆరాతీసిన దర్శకనిర్మాతలు కైరాను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మెగా హీరో అనే సరికి మారు మాట చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అంటే మెగా హీరోతో రెండోసారి సినిమా చేస్తోందన్న మాట.

కాగా.. వరుణ్ హీరోగా వస్తున్న ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌ నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం బాక్సర్‌గా ముంబైలో వరుణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మెగా హీరోల్లో మొదటి సినిమా ‘వినయవిధేయ రామ’తో ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ బ్యూటీ కైరా.. వరుణ్‌తో హిట్ వర్కవుట్ అవుతుందో..? లేదో..? అసలు మెగా హీరోతో కైరా రొమాన్స్ చేయనుందన్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

News About Mega Hero Varun Tej New Movie!:

News About Mega Hero Varun Tej New Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ