Advertisementt

‘సరిలేరు’ తర్వాత చూసుకుందామంటుంది!

Tue 05th Nov 2019 11:01 PM
vijayashanthi,sarileru neekevvaru,movies,politics,acting  ‘సరిలేరు’ తర్వాత చూసుకుందామంటుంది!
Vijayashanthi Decision on Acting ‘సరిలేరు’ తర్వాత చూసుకుందామంటుంది!
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయ శాంతి ఆ సినిమాలో పాత్ర కోసం భారీ పారితోషకం అందుకుంది అనే టాక్ మాములుగా ప్రచారంలోకి రాలేదు. అయితే ఎంత అనే ఫిగర్ తెలియదు కానీ.. విజయ్ శాంతి మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటున్నారు. అయితే మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా గనక బడ్జెట్ భారీగా ఉంటుంది... అడిగిన పారితోషకం ఇస్తారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ కేరెక్టర్ చేస్తుందనే విషయం ఆమె లుక్ ద్వారానే తెలుస్తుంది. ఇక ఆ పాత్ర తాలుకు పవర్ ఫుల్ నెస్ చూడడం, అలాగే భారీ పారితోషకాన్ని విజయశాంతి టెంప్ట్ అవడం వల్లే రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని అంటున్నారు.

అయితే సరిలేరు సినిమా చేస్తుంది గనక... మా సినిమాల్లో కూడా నటించమని కొంతమంది దర్శకనిర్మతలు విజయశాంతిని సంప్రదిస్తున్నారట. ఆమె పారితోషకం ఎక్కువైనా సరే ఆమెని తమ సినిమాలలో నటింపచేయాలని భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే విజయశాంతికి పారితోషకం నచ్చినప్పటికీ... సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అయితే తర్వాత సినిమాల సంగతి చూద్దాం... అని విజయశాంతి అనుకుంటుందట. ఒకవేళ సరిలేరు గనక తేడా కొడితే.. సినిమాలు వదిలేసి..రాజకీయాలతో బిజీగా వుంటుందేమో..!

Vijayashanthi Decision on Acting:

After Sarileru Neekevvaru Result.. I Will Take Decision Says Vijayashanthi 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ