Advertisementt

‘బిగ్ బాస్ 3’ ఫైనల్ ఎపిసోడ్: అంతా డ్రామానే!

Tue 05th Nov 2019 08:24 PM
bigg boss 3,final,episode,hi drama  ‘బిగ్ బాస్ 3’ ఫైనల్ ఎపిసోడ్: అంతా డ్రామానే!
Negative Comments on Bigg Boss 3 final Episode ‘బిగ్ బాస్ 3’ ఫైనల్ ఎపిసోడ్: అంతా డ్రామానే!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 3 మొదలైనప్పుడు.. బుల్లితెర ప్రేక్షకుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ కనబడలేదు. కానీ వీకెండ్ నాగార్జున హోస్టింగ్ తో మెల్లిగా పుంజుకున్న బిగ్ బాస్ షో.. చివరికి వచ్చేసరికి చాలా చప్పగా తయారైంది. కారణం ప్రతివారం బిగ్ బాస్ లీకులు. ఆదివారం ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్స్ గురించి శనివారం సోషల్ మీడియాలో రావడంతో.. ఆదివారం ఎపిసోడ్ పై ఆసక్తి లేకుండా పోయింది. బిగ్ బాస్ లీకులు వారం వారం కొనసాగినట్టుగానే ఫైనల్ ఎపిసోడ్ లీకు, విన్నర్ ఎవరనేది శనివారం రాత్రే బయటికొచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 టాప్ 5 లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ లలో రాహుల్ విన్నర్ అనేది ముందే తెలిసిపోయింది.

అయితే స్టార్ మా మాత్రం బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో హీరోయిన్స్ డాన్స్ పెరఫార్మెన్సెస్ తో రెడీ చేసింది. కేథరిన్, నిధి అగర్వాల్, రాశి ఖన్నా, అంజలి, మారుతీ, శ్రీకాంత్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ స్టేజి మీద నాగార్జునతో కలిసి హాట్ హాట్ పెరఫార్మెన్సెస్ తో హడావిడి చేసి.. ముందుగా అలీ రేజని ఎలిమినేట్ చెయ్యడంతో.. టాప్ 5 నుండి అలీ బయటికొచ్చేసాడు. అయితే స్టార్ మా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోస్ ని గంటగంటకు వదులుతూ హడావిడి చెయ్యడమే కాదు... రాహుల్ విన్నర్ అనే లీక్ ని నాగార్జున కొట్టిపడేస్తూ... డైరెక్టుగా ఆదివారం రాత్రి లైవ్ లో బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించడం జరుగుతుందని ట్వీట్ చేసినా.. ముందే రాహుల్ విన్నర్ అని తేలిపోయింది కాబట్టి... ఫైనల్ ఎపిసోడ్ చూడడానికి బుల్లితెర ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు.

నాగార్జున ఎంత మొత్తుకుని ఈ ఫైనల్ ఎపిసోడ్ ని హైప్ చేద్దామన్నా.. కుదరలేదు. కాకపోతే ఒకే ఒక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫైనల్ విన్నర్ కి బిగ్ బాస్ ట్రోఫీని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద అందించడం ఒక్కటే... ఈ ఫైనల్ ఎపిసోడ్ లో ఊరట నిచ్చే అంశం. చిరంజీవి ఎనర్జిటిక్ గా ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంది. నాగార్జున జర్నీ కూడా హైలెట్ చెయ్యడం, బిగ్ బాస్ విన్నర్ ని చిరు ప్రకటించడం, విన్నర్ రాహుల్ కి బిగ్ బాస్ సీజన్ 3 ట్రోఫీని చిరు అందించడం కాస్త ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు. అయితే ఇక స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ తో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోవాలనుకుంది. చూద్దాం ఈ వారం టీఆర్పీలో స్టార్ మా విజయకేతనం ఎగరేస్తుందేమో..!.

Negative Comments on Bigg Boss 3 final Episode:

Bigg Boss 3 Final Episode: only Hi Drama

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ