తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ కి వ్యాఖ్యాతలు మారిపోతూనే ఉన్నారు. సీజన్ 1 కి ఎన్టీఆర్, 2 కి నాని, రీసెంట్ గా ముగిసిన 3 కి నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇక అప్పుడే బిగ్ బాస్ సీజన్ 4 హోస్టింగ్ ఎవరు చేస్తే బావుండు అనే దానిమీద అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకొచ్చేశాయి. అయితే అందరిలో ఎక్కువగా చిరంజీకి పేరు వినబడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి ఇచ్చిన స్పీచ్, కామెడీ, హావభావాలు అందరూ ముగ్దులవుతున్నారు. కంటెస్టెంట్స్ తో చిరు ప్రవర్తించిన తీరుకు అందరూ చిరు హోస్టింగ్ మీద మనసు పారేసుకుంటున్నారు.
అంతలా చిరు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో స్పెషల్ గెస్ట్ గా మెప్పించాడు. అందుకే సీజన్ 4 కి చిరు పేరే హైలెట్ అవుతుంది. మరి చిరు దానికి ఒప్పుకుంటాడో లేదో అనేది... తెలియాలంటే చాలా సమయమే పడుతుంది. అయితే చిరంజీవి ఒప్పుకోకపోవటానికి కూడా కారణాలున్నాయి. ఎన్టీఆర్ ఎంతో హుందాగా హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ కి, టు విషయానికొచ్చేసరికి... నానిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఇక సీజన్ 3 కి నాగార్జున కూడా చివరిలో ట్రోల్ కి గురైయ్యాడు. మరి కాంట్రవర్సీలకు వేదికగా మారిన బిగ్ బాస్ హోస్టింగ్ కి చిరు సై అంటాడా.. లేదంటే నో చెబుతాడో అంటూ వార్తలొస్తున్నాయి.