Advertisement

నాని ‘వి’ విడుదల తేదీ ఫిక్స్..!

Tue 05th Nov 2019 01:34 PM
nani,sudheer babu,v movie,release,march 25  నాని ‘వి’ విడుదల తేదీ ఫిక్స్..!
V MOVIE RELEASE DATE Fixed నాని ‘వి’ విడుదల తేదీ ఫిక్స్..!
Advertisement

ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల‌వుతున్న నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు, శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ , మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్ మూవీ ‘వి’

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘వి’. ‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి  నా దయా దాక్షిణ్యాలే దిక్కు’’ ట్యాగ్ లైన్‌. హీరో  నాని 25వ చిత్ర‌మిది. నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ నిర్మాత‌లుగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేస్తున్నారు ఈ సంద‌ర్భంగా ...

నిర్మాతలు శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ మాట్లాడుతూ.. ‘‘నాని 25వ చిత్రం మా బ్యాన‌ర్‌లో రూపొందుతుండ‌టం ఆనందంగా ఉంది. అలాగే సుధీర్‌బాబుగారు, నివేదా థామ‌స్‌, అదితిరావుగారి కాంబినేషన్ కుదిరింది. ఈ చిత్రంలో నాని మరియు సుధీర్ బాబు పోటా పోటీగా నటించారు.   మోహనకృష్ణ‌గారు స‌మ్మోహ‌నం వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. 80 శాతం చిత్రీక‌రణ పూర్త‌య్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నానిగారు చూడ‌ని ఓ కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఉగాది సంద‌ర్భంగా సినిమాను మార్చి 25న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 

న‌టీన‌టులు:

నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:

మ్యూజిక్‌: అమిత్ త్రివేది

సినిమాటోగ్ర‌ఫీ:  పి.జి.విందా

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

నిర్మాత‌లు:  శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్‌

ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

V MOVIE RELEASE DATE Fixed:

V MOVIE RELEASE on March 25th

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement