దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో విడుదలకు సిద్ధమైన సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘బొంభాట్’
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘ఈనగరానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్‌కర్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షనల్ ఎంటర్‌టైనర్ ‘బొంభాట్`’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ‘‘యంగ్ బ్లడ్ కలిసి చేసిన ‘బొంభాట్’ ఫస్ట్ లుక్ బావుంది. సుశాంత్, సిమ్రాన్, చాందిని, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. జోష్.బి నాకు మంచి స్నేహితుడు. తను మ్యూజిక్ డైరెక్టర్‌గా సంగీత సారథ్యం వహించారు. త్వరలో పాటలు మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్‌తో బొంభాట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.