Advertisementt

50 లక్షలతో విన్నర్ రాహుల్ ఏం చేయబోతున్నాడు!

Mon 04th Nov 2019 08:47 PM
biggboss-3,telugu biggboss show,biggboss winner,singer rahul sipligunj,sreemukhi  50 లక్షలతో విన్నర్ రాహుల్  ఏం చేయబోతున్నాడు!
News About Biggboss-3 Winner Singer Rahul Sipligunj 50 లక్షలతో విన్నర్ రాహుల్ ఏం చేయబోతున్నాడు!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 విజేతగా తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈ ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌కే పరిమితం అయ్యింది. అయితే శ్రీముఖిదే ఈ సీజన్ అని బిగ్‌బాస్ ప్రియులు, ప్రేక్షకులు, నెటిజన్లు, పవన్ వీరాభిమానులు భావించారు. అయితే లెక్క ఎక్కడ తప్పిందో..? శ్రీముఖికి ఏం మైనస్ అయ్యిందో.. రాహుల్‌‌కు ప్లస్ అయ్యిందేంటో ఇప్పటికీ అర్థంగాని పరిస్థితి. జూలై 22న  17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఎన్ని ట్విస్ట్‌లతో షో సాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక అసలు విషయానికొస్తే.. విన్నర్‌గా నిలిచిన రాహుల్ రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తన లైఫ్, బిగ్‌బాస్ హౌస్‌లో జరిగన ఆసక్తికర విషయాలను ఈ సంద్భంగా పంచుకున్నాడు. అంతేకాదు రూ. 50లక్షల ప్రైజ్ మనీతో తానేం చేస్తానో కూడా చెప్పేశాడు. ఆ డబ్బుతో ‘బార్బర్‌ షాప్‌’ పెడతానని రాహుల్‌ ప్రకటించాడు. విన్నర్ ఈ ప్రకటన చేయడంతో నిజంగానే అతడి సింప్లిసిటీ, కులవృత్తి మీదున్న గౌరవాన్ని నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు అందరూ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశాడు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్‌ కొత్తగా ఉండబోతోందన్నాడు. 

అంతటితో ఆగని రాహుల్.. ‘నా విజయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారు. నా విజయంలో పునర్నవి, వరుణ్‌, వితికల కష్టం కూడా ఉంది. ఆ ముగ్గురి ప్రోత్సాహం వల్లే గేమ్‌ బాగా ఆడి విజేతగా నిలిచాను. అయితే టాస్క్‌ల వల్లే శ్రీముఖికి, నాకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదు. ఎవరైనా తప్పులు చేస్తారు. నేను కూడా మొదట్లో తప్పులు చేశాను. నా తప్పులు తెలుసుకొని సరిదిద్దుకున్నానని నేను భావిస్తున్నాను. మా ఇక నుంచి నా లైఫ్‌ కొత్తగా మారుతుంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’ అని చెప్పి రాహుల్ ఒకింత ఎమోషనల్ అయ్యాడు.

News About Biggboss-3 Winner Singer Rahul Sipligunj:

News About Biggboss-3 Winner Singer Rahul Sipligunj

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ