బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున స్టేజి మీద ఇచ్చిన స్పీచ్, కంటెస్టెంట్స్‌తో మాట్లాడిన మాటలు, హీరోయిన్స్ డ్యాన్స్, బిగ్ బాస్ ఎలిమినేట్ హౌస్ మేట్స్ హడావిడి ఒక ఎత్తైతే... బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీని ప్రెజెంట్ చెయ్యడానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఒక ఎత్తు. నాగార్జునతో కలిసి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నవ్వులు పూయిస్తూ మెగాస్టార్ చేసిన సందడి అబ్బా... అదుర్స్ అన్న రేంజ్‌లో ఉంది. చిరంజీవి, నాగ్ బిగ్ బాస్ జర్నీ చూసి అప్రిషియేట్ చెయ్యడమే కాదు.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఫుల్ కామెడీ చేసాడు.
ఇక కంటెస్టెంట్స్‌తో చిరంజీవి మాట్లాడుతూ ఫన్ జనరేట్ చేసారు. పునర్నవిని గారు అంటూ మిమ్మల్ని గారు అనలేదు అంటూ ఏడిపించడం, వరుణ్ సందేశ్ వితికాలతో మాట్లాడుతూ... వితిక మా ఊరమ్మాయి, భీమవరం అమ్మాయి, వరుణ్ సందేశ్ మా ఊరి అల్లుడు అంటూ ఫన్నీగా మాట్లాడడం, తర్వాత హిమజాని అప్రిషియేట్ చెయ్యడం, రోహిణి చిరుకి ఐ లవ్ యు చెప్పగా... ఆ ఐ లవ్ యు అనే పదం ఈ వయసులో వినడానికి బావుంది అని చిరు సిగ్గు పడడం, రవితో కామెడీ చెయ్యడం, ఇక జ్యోతితో తెలంగాణ యాస మాట్లాడడం, తమన్నాని సోదరి అనడం, ఆమె ధైర్య సాహసాలను పొగడడంతో పాటుగా కాస్త ఎమోషన్ అవడం, అలీని నాగార్జునతో పోల్చడం, ఇంకా బాబా భాస్కర్‌ని 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో బాగా నటించావంటూ ఆట పట్టించడం, మీరు మీ కోపాన్ని 100 రోజుల పాటు జయించారని బాబా కి చెప్పడమే కాదు.... టీవీ 9 జాఫర్ తో మాట్లాడాలి అంటే కాస్త భయమంటూ చిరు కామెడీ చెయ్యడం ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కె హైలెట్ అనేలా ఉంది.