Advertisementt

వైభవంగా రచయితల సంఘం ర‌జ‌తోత్స‌వ వేడుకలు

Mon 04th Nov 2019 01:03 PM
writers,association,silver,jubilee,celebrations,highlights  వైభవంగా రచయితల సంఘం ర‌జ‌తోత్స‌వ వేడుకలు
Writers Association Silver Jubilee Celebrations Highlights వైభవంగా రచయితల సంఘం ర‌జ‌తోత్స‌వ వేడుకలు
Advertisement
Ads by CJ

తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్స‌వ వేడుకలు ఆదివారం నాడు ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ముందుగా భలభద్రపాత్రుని రమణిగారి తొలిపలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆకెళ్ళ కార్యదర్శి నివేదిక సమర్పించారు. మహిళా సభ్యులందరూ  దీపారాధనతో ప్రారంభించారు. అనంతరం రమణాచారి చేతులమీదుగా, ఛాంబర్‌ వారి చేతులమీదుగా 6 నిముషాల వీడియో వ్యవస్థాపక పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, గౌరవపురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.

అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ... ఇక్కడకు రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీపరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. మొన్నీమధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం. అందమైన వెండి సింహాసనం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చో పెట్టారు. అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు అనిపించింది. ఒక్క సత్యానంద్‌నేకాదు రచయితలందరూ గౌరవించేదిగా వుంటుంది. ఈ విషయమై సరదాగా మోహన్‌బాబుగారు ఓ మాట అన్నారు. రాఘవేంద్రరావును నిలబెట్టి సత్యానాంద్‌ను కూర్చొపెట్టడం ఏమిటని.. అప్పుడు.. నేనన్నాను. రాఘవేంద్రరావు శిల్పి. అది చెక్కాలంటే తగిన రాయికావాలి. అది కంటెంట్‌. ఆ కంటెంట్‌ సత్యానంద్‌.. అందుకే గౌరవించుకోవడం జరిగిందని.. సరదాగా మాట్లాడుకున్నాం. ఇదంతా రచయితలతో నాకున్న అనుబంధం. పరుచూరి బ్రదర్స్‌తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ‘మగమహారాజు’కు రాసిన ఆకెళ్ళ ఇక్కడే వున్నారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఈ సభకు నన్ను పిలకపోయివుంటే అసంతృఫ్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతులమీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం. తెలుగు పరిశ్రమను వృద్ది చేయడానికి వారంతా వున్నారు. నాకు ఆదివిష్ణుగారితో పరిచయం తక్కువ. ఆయన సినిమాలకు తక్కువ రాసినా జంథ్యాల గారితో అనుబంధం చాలా గొప్పది. నాటకరచయితగా అద్భుతాలు చేశారు. 

ఇక రావికొండలరావుగారు నాటక రచయితగా, సంపాదకుడిగా, నటుడిగా, సాహితీవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు, రమణలకు అత్యంత ఆప్తుడు ఆయన. ఇక కోదండరామిరెడ్డిగారితో 25 సినిమాలు సుదీర్థ ప్రయాణం మాది. దర్శకుడిగాకంటే ఆత్మీయుడు, స్నేహతుడిగా కన్పిస్తాడు. కల్మషం లేని వ్యక్తి. అందరూ మేథావులే అని వారి భావాలు స్వీకరిస్తారు. సమిష్టి కృషి అని నమ్మేవ్యక్తి. రచయితలతో సాంగత్యం వుంటుంది. అలాగే మ్యూజిక్‌ రాబట్టడంలో దిట్ట. మా కాంబినేషన్‌లో పాటలు హిట్‌ అయ్యాయి. ఇక భువన చంద్రగారు.. ఆయన మిలట్ట్రీ మనిషి. విజయబాపినీడుగారు మొదటిసారి.. ఖైదీ నెం.786తో పరిచయం చేశారు. ఆరుద్ర, ఆత్రేయగారి టైంలో ఈయన రాస్తారా అనిపించింది. ఆ తర్వాత ఆయన రాసిన విధానం చూశాక.. రణరంగంలో గన్‌తో పేల్చినట్లు.. సినీకలంతో విజృంభించారు. ఆయన రాసిన మూడు పాటలు.. నేటితరం రీమిక్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు.  ‘గువ్వాగోరింక..’ ‘బంగారు కోడిపెట్ట,’ ‘వాన వాన వెల్లువాయె..’ వంటివి అందుకు నిదర్శనం. ఇలా వీంరదిరినీ సత్యరించుకోవడంతోపాటు నా కృతజ్ఞత తెలుపుకోవడానికి అవకాశం కల్గింది. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు కూడా వచ్చివుంటే బాగుండేది. అది లోటుగా భావిస్తున్నా. వారిద్దరు మనకు నిధి లాంటివారు. మాయాబజార్‌ నుంచి ఈ కాలంవరకు వున్న వ్యక్తులు. వారు రాలేకపోయారు. ముందుముందు వారిని సన్మానించుకునే అవకాశం నాకు ఇవ్వగలిగితే బాగుంటుందని.. కోరారు.

ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు సినీ నీరాజనం ఏవీ లాంఛ్‌ చేశారు. అనంతరం రాఘవేంద్రావు మాట్లాడుతూ... రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. అందరూ రచయితలు దర్శకుడులయ్యారు. అందకనే కొత్త రచయితల్నే నమ్ముకోవాల్సిందే.. నేను పరిచయం చేసిన రయితలందరూ  ముఖ్యంగా సత్యానంద్‌, పరుచూరి బ్రదర్స్‌, భారవి, హరనాథ్‌బాబు, జంథ్యాల ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను సత్యానంద్‌గారు ఇప్పుడే ఓ విషయం అనుకున్నాం. డైరెక్టర్‌ కేప్టెన్‌ ఆఫ్‌ షిప్‌ అంటారు కదా.. మరి మీరందరు ఎవరయ్యా! అని సత్యానంద్‌తో అన్న. ఆయన చెప్పింది ఏమంటే.. నిర్మాత షిప్‌ ఓనర్‌. రచయిత, కథ, మాటలు షిప్‌. దానికి పేరు పెట్టాలికదా.. ఎన్‌టిఆర్‌. చిరంజీవి, ఎఎన్‌.ఆర్‌.. ఇలా హీరోలు షిప్‌ పేర్లు. ఇక మిగతా నటీనటులు సాంకేతిక సిబ్బంది ప్రయాణీకులు. జనమే సముద్రం. వారు ఆదరిస్తే ఒడ్డున చేరుకుంటాం. లేదంటే మునిగిపోతాం.. అంటూ చమత్కరించారు.

మోహన్‌బాబు లివింజ్‌లెజెండ్స్‌ ఏవీ లాంఛ్‌ చేశారు. పిదప మోహన్‌బాబు మాట్లాడుతూ...  రచయితలు సరస్వతీ పుత్రులు. వీరిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా వూహించలేదు. నా జీవితంలో చాలా విషయాలున్నాయి. మొట్టమొదట.. నేను అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌.. గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు.. ఇలా ఎంతోమంది నాకు పరిచయం. అలాంటి ఆరుద్ర ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆయన చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. నేను మొదట వేషం కావాలని వెంటపడింది సత్యానంద్‌గారి దగ్గరే. ఆ విషయాలను గుర్తుచేసుకుంటే ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అలాంటి వ్యక్తిని నా చేతులమీదుగా సన్మానించుకోవడం దేవుడిచ్చిన అదృష్టం. నాకు తండ్రిలాంటి దాసరి, సోదరుడు రాఘవేంద్రావు. ఇలా ఆ దర్శకుల ఆశీస్సులతో ఈ స్తితిలో ఉన్నా. ఎందరో మేథావులు ఇండస్ట్రీలో వున్నారు. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌కు మొదట సత్యానంద్‌గారు మాటలు రాశారు. ఒళ్ళుపులకరించే డైలాగ్స్‌లు రాసేవారు. పరుచూరి బ్రదర్స్‌ అద్భుతంగా రాశారు. అసెంబ్లీ రౌడీ.. 25 వారాలు ఆడింది. ప్రతీ డైలాగ్స్‌ చప్పట్లు కురిపించాయి. సత్యమూర్తి కూడా చాలా రాశాడు. మనకంటే ఎందరో అందగాళ్ళు మేథావులున్నారు. ఈ కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది. దాన్ని కాపాడుకుందాం. రచయితల ఆశీస్సులు మాకు కావాలి.. అంటూ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట రచనా పురాస్కారాలు ఆకుల చంద్రబోసు, సుద్దాల, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, వీణాపాణి, అనంత్‌ శ్రీరామ్‌, భాస్కరభట్ల, తైతలబాపు, భారతీబాబు, జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, త్రివిక్రమ శ్రీనివాస్‌, వక్కంతం వంశీ, బుర్రా సాయిమాధవ్‌, రామజోగయ్య శాస్త్రి, బలభద్రపాత్రుని రమణి, మాధవ పట్నాయక్‌ (జడ్జి), ఎస్‌వి రామారావు, పరుచూరి వెంకటేశ్వరావు, తోటపల్లి సాయినాధ్‌, ఆకెళ్ళ, గద్దర్‌, సాహితీ, సిరివెన్నెల సీతామారాశాస్త్రి, భూపతిరాజా, అందెశ్రీ, దివాకరబాబు, శివశక్తి దత్త, గోరేటి వెంకన్న, మరుధూరి రాజా, తోటపల్లి మధు, సంజీవి మొదలి, జనార్దన మహర్షి, పోసాని కృష్ణమురళీ, రాజేంద్రకుమార్‌, చింతపల్లి రమణ, ఆకుల శివ, ఎం. రత్నం, లక్ష్మీభూపాల్‌ అందజేశారు. తనికెళ్ళ భరణి, డా.పాలకేడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు గౌరవ పురస్కారాలు అందజేశారు.

Writers Association Silver Jubilee Celebrations Highlights:

Celebrities speech at Writers Association Silver Jubilee Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ