Advertisementt

ఢిల్లీగా కార్తీ మళ్ళీ వస్తాడంట!

Mon 04th Nov 2019 12:54 PM
hero karthi,thanks,mahesh babu,khaidi,movie  ఢిల్లీగా కార్తీ మళ్ళీ వస్తాడంట!
karthi Talka about Khaidi 2 ఢిల్లీగా కార్తీ మళ్ళీ వస్తాడంట!
Advertisement
Ads by CJ

మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు - యాంగ్రీ హీరో కార్తీ

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌ సాధిస్తోన్న ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి థాంక్స్ చెప్పిన యాంగ్రీ హీరో కార్తి

యాంగ్రీ హీరో కార్తి  మాట్లాడుతూ - ‘‘ఖైదీ చిత్రం పట్ల మీరు చూపించే ప్రేమ,  మీరు అందించిన ప్రశంసలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియ‌డం లేదు.  ఒక ఎగ్జైటింగ్ స్టోరీని మీకు అందించాలనే లక్ష్యంతో నేను మా టీమ్ మనసు పెట్టి హార్డ్ వర్క్ చేశాం.  కానీ మేము ఈ స్థాయిలో రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్  చేయలేదు. మా చిత్రాన్ని చూసి అభినందించిన మహేష్ బాబు గారికి థాంక్స్. తన ప్రశంసలతో టీమ్ అంతా థ్రిల్ అయ్యారు. ఈ సినిమాని అభినందిస్తూ అందరిలోకీ తీసుకెళ్ళిన మీడియా వారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు.’’  అన్నారు.

విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తూ యాంగ్రీ హీరో కార్తిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని సమర్పకులు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ అన్నారు.

karthi Talka about Khaidi 2:

Karthi says thanks to Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ