Advertisementt

రెండూ రెండే.. కాస్త అదే బెటర్..!

Sun 03rd Nov 2019 11:18 PM
aaviri,meeku matrame chepta,box office result,friday release movies  రెండూ రెండే.. కాస్త అదే బెటర్..!
Aaviri and Meeku Matrame Chepta Result at Box Office రెండూ రెండే.. కాస్త అదే బెటర్..!
Advertisement
Ads by CJ

మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందు రెండు మూడు సినిమాలు వచ్చాయి. అందులో రెండు సినిమాలే ప్రేక్షకులకు తెలిసినవి. ఎందుకంటే ఓ సినిమాకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాత. మరో సినిమాకి రవి బాబు డైరెక్టర్ గనక. విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ నటించిన మీకు మాత్రమే చెప్తా, రవిబాబు ఆవిరి సినిమాలు విడుదలయ్యాయి. మీకు మాత్రమే చెబుతా సినిమాకి యావరేజ్ టాక్ రాగా.. ఆవిరికి ప్లాప్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మాత, ప్రమోషన్స్ గట్టిగా ఉండడంతో మీకు మాత్రమే చెప్తా మొదటి రోజు పర్వాలేదనిపించింది. కానీ ఆవిరికి అసలు ప్రమోషన్స్ లేకపోవడం, రవిబాబు వరస ఫెయిల్యూర్స్ తో ఉండడంతో ఆవిరి కి మొదటి రోజు ఓపెనింగ్స్ పేలవంగా వున్నాయి.

ఇక మీకు మాత్రమే చెప్తా సినిమాలో తరుణ్ భాస్కర్ నటన, అభినవ్ గోమఠం నటన, నేపధ్య సంగీతం, స్టోరీ లైన్ బావున్నప్పటికీ.. విజయ్ దేవరకొండ నిర్మాణ విలువలు, సినిమా షార్ట్ ఫిలిం ని తలపించడం, మ్యూజిక్ అంతగా లేకపోవడంతో  సినిమాకి యావరేజ్ టాక్ పడింది. కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.... మీకు మాత్రమే చెప్తా సినిమా ఆడడం కష్టమే. ఎందుకంటే కార్తీ ఖైదీ సినిమా ఇంకా దుమ్మురేపుతుండటంతో.... ఈ సినిమాకి దెబ్బ పడడం ఖాయం. ఇక ఆవిరి సినిమాకైతే ప్లాప్ టాకొచ్చేసింది. ఆవిరి ఫస్ట్ హాఫ్, స్క్రీన్ ప్లే బావున్నప్పటికీ.. సెకండ్ హాఫ్, భయపెట్టే అంశాలు లేకపోవడం, కథ వీక్ అవడంతో సినిమాకి క్రిటిక్స్ కూడా ప్లాప్ రేటింగ్స్ ఇచ్చేసారు.

Aaviri and Meeku Matrame Chepta Result at Box Office :

Aaviri vs Meeku Matrame Chepta

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ