Advertisementt

పవన్ సినిమా క్రిష్‌తో కాదా..?

Sun 03rd Nov 2019 01:50 PM
venu sriram,pawan kalyan,new movie,director  పవన్ సినిమా క్రిష్‌తో కాదా..?
Pawan Kalyan Director Changed పవన్ సినిమా క్రిష్‌తో కాదా..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో ఓ మూవీ నవంబర్ 15న మొదలవ్వబోతుందనే న్యూస్ ఈ మధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దానితో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద, ఆయనతో నటించే హీరోయిన్ మీద బోలెడన్ని న్యూస్ లు మనుగడలోకి వచ్చాయి. అయితే తాజాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదని..  దిల్ రాజు నిర్మాతగా.. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పింక్ రీమేక్ ని పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా తానొక సినిమా చెయ్యాలని దిల్ రాజు ఎప్పటినుండో కాచుకుని కూర్చున్నాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో డీలా పడిన దిల్ రాజు తాజాగా పవన్ ని ఒప్పించి బాలీవుడ్ పింక్ రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నాడట. దీనికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేయబోతున్నాడట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఫిక్స్ అంటున్నారు. అది ఈ నెలలోనే పూజ కార్యక్రమాలతో పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Pawan Kalyan Director Changed:

Venu Sriram Directs Pawan Kalyan 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ