కాస్త స్టార్ డమ్ వచ్చిన వ్యక్తి హీరోగా సినిమా చేస్తున్నాడు అంటే... ఆ సినిమా దర్శకుడు దగ్గర నుండి.. నిర్మాత వరకు బెస్ట్ ఉండాలని కోరుకుంటాడు. డైరెక్షన్ లో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ లో కానీ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకుండా ముందే వారితో మాట్లాడుకుంటాడు. మరి విజయ్ దేవరకొండకి తగిలిన నిర్మాతలు కూడా విజయ్ ఎలాచెబితే అలా వినే నిర్మాతలే ఎక్కువమంది ఉన్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు చేసాడు. మరి తనని స్టార్ గా నిలబెట్టిన ప్రేక్షకుల ముందుకు నిర్మాతగా విజయ్ దేవరకొండ వస్తున్నాడు అంటే... ఆ సినిమా ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకులు ఇమేజిన్ చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. హీరోగా అదిరిపోయే కథలు ఒప్పుకునే విజయ్ దేవరకొండ... నిర్మాతగా అందరికి మెచ్చే సినిమాని ఇస్తాడనుకోవడంలో తప్పులేదు.
విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా నిన్న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అయితే బీభత్సముగా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ నిర్మాతగా తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా సినిమాకి జస్ట్ యావరేజ్ టాక్ పడింది. అయితే సినిమాలో కామెడీ, తరుణ్ నటన, నేపధ్య సంగీతం బావున్నప్పటికీ... మ్యూజిక్, సెకండ్ హాఫ్, కథనంలో లోపాలతో పాటుగా మెయిన్ విజయ్ దేవరకొండ నిర్మాణ విలువలు వేలెత్తి చూపించేవిలా ఉన్నాయంటున్నారు. చెత్త నిర్మాణ విలువలు అంటూ సంబోధిస్తున్నారు. షార్ట్ ఫిలిం తీసినట్టుగా సినిమాని తీసేశారని, నిర్మాతగా విజయ్ ఎఫర్ట్ సరిపోలేదని, ప్రమోషన్స్ మీద పెట్టిన దృష్టి నిర్మాతగా విజయ్ దేవరకొండ పెట్టలేదని, నిర్మాణ విలువలు ఆచి తూచి పెట్టినట్టుగా ఉన్నాయని అంటున్నారు.